సంక్రాంతికి విక్రమ్ 'స్కెచ్'
Send us your feedback to audioarticles@vaarta.com
'అపరిచితుడు' సినిమాతో తెలుగు ఇండస్ట్రీని, తెలుగు మార్కెట్ ని తన వైపు తిప్పుకున్న హీరో విక్రమ్. ఈ సినిమా తర్వాత విక్రమ్ సినిమాలు డబ్ చేయడం, రీమేక్ చేయడం కూడా జరుగుతోంది. ఇప్పుడు ఇదే కోవలో మరో విక్రమ్ సినిమా తెలుగులోకి అనువాదం రూపంలో రానుంది. అదే స్కెచ్. విజయ్ చందర్ డైరెక్షన్ లో విక్రమ్, తమన్నా హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ 'స్కెచ్'ని.. వి క్రియేషన్స్ బ్యానర్ లో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు.
'తుపాకి', 'కబాలి' సినిమాల నిర్మాత కలైపులి ఎస్.థను నిర్మించిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. డిసెంబర్ 15కల్లా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తై పోతాయని నిర్మాతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. పండుగ నెలను పురస్కరించుకుని తమ మూవీని సంక్రాంతి బరిలో దించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇప్పటికే సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ 25వ చిత్రం, బాలకృష్ణ జై సింహా, విశాల్ అభిమన్యుడు ఉన్న సంగతి తెలిసిందే. ఐ తరువాత విక్రమ్ నుంచి రానున్న సంక్రాంతి మూవీ ఇదే కావడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com