అది ఇంకొక్కడు తో నెరవేరింది - విక్రమ్
Send us your feedback to audioarticles@vaarta.com
శివపుత్రుడు, అపరిచితుడు, ఐ...ఇలా విభిన్నమైన చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించిన విక్రమ్ నటించిన తాజా చిత్రం ఇంకొక్కడు. ఈ చిత్రంలో విక్రమ్ సరసన నయనతార, నిత్యామీనన్ నటించారు. ఈ చిత్రం ఈనెల 8న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందకు వస్తుంది. ఈ సందర్భంగా హీరో విక్రమ్ మాట్లాడుతూ...నేను ఎప్పటి నుంచో విలన్ గా నటించాలి అనుకుంటున్నాను. కానీ...కుదరలేదు.
అయితే...ఈ సినిమాలో లవ్ అనే క్యారెక్టర్ చేయడంతో విలన్ గా చేయాలనే నా కల నెరవేరింది. విలన్ ఎంత బలం ఉంటే సినిమా అంత బాగుంటుంది. ఇంకొక్కడు సినిమాలో నేను అనుకున్న బలమైన విలన్ క్యారెక్టర్ చేసాను.లవ్ అనే ఈ క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ క్యారెక్టర్ ఆడియోన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది అంటూ తన కల నెరవేరినందుకు సంతోషం వ్యక్తం చేసాడు విక్రమ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com