విక్రమ్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?
Send us your feedback to audioarticles@vaarta.com
విక్రమ్... శంకర్ దర్శకత్వంలో నటించిన ఐ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా కో్సం విక్రమ్ చాలా కష్టపడ్డాడు. కానీ ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. విక్రమ్ ప్రస్తుతం 10 ఎన్ ద్రాతుకుల్ల అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చెన్నైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే...విక్రమ్..బాల డైరెక్షన్ లో నటించేందుకు రెడీ అవుతున్నాడట.
గతంలో విక్రమ్, బాల కాంబినేషన్ లో రూపొందిన శివపుత్రుడు ఎంతటి సంచలనం స్రుష్టించిందో తెలిసిందే. ఈ సినిమాకు గాను విక్రమ్ ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. మళ్లీ ఇప్పుడు బాల డైరెక్షన్ నటించేందుకు విక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెన్నై సమాచారం. ఐ సినిమాతో సక్సెస్ సాధించలేకపోయిన విక్రమ్ ఈసారి బాలతో కలసి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. మరి విక్రమ్ ప్లాన్ వర్కవుట్ అవుతుందో..? లేదో..? చూద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com