ఇంకొక్కడు లో డిఫరెంట్ గెటప్ తో షాక్ ఇచ్చిన విక్రమ్
Tuesday, August 2, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ హీరో విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ఇరు ముగన్. ఈ చిత్రాన్ని ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఇంకొక్కడు అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ సరసన నయనతార, నిత్యామీనన్ నటిస్తున్నారు.
శంకర్ దర్శకత్వంలో నటించిన ఐ ఫ్లాప్ అయినా విక్రమ్ నటుడుగా మాత్రం శభాష్ అనిపించుకున్నాడు. అయితే...గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విక్రమ్ తాజా చిత్రం ఇంకొక్కడు సినిమాలో కూడా ప్రయోగం చేస్తున్నాడు. ఈ చిత్రంలో విక్రమ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒక క్యారెక్టర్ పోలీస్ అయితే...మరోకటి హిజ్రా క్యారెక్టర్ కావడం విశేషం. ఈరోజు ఇంకొక్కడు ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ లో విక్రమ్ హిజ్రా క్యారెక్టర్ ను రివీల్ చేసారు.ఈ ట్రైలర్ చూస్తుంటే...డిఫరెంట్ గా ఉన్న హిజ్రా క్యారెక్టర్ లో విక్రమ్ అదరగొట్టేసాడు అనేలా నటించాడనిపిస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లో సెప్టెంబర్ 5న రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments