విక్రమ్‌తో పోటీపడుతున్న నయనతార
Send us your feedback to audioarticles@vaarta.com
విక్రమ్, నయనతార.. ఈ కాంబినేషన్‌లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. గతంలో వీరి కలయికలో సినిమా తీయాలని తమిళ ఫిల్మ్‌మేకర్స్ ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అలాంటి ఈ ఇద్దరు తారలు జోడీకట్టడం మాట పక్కనపెడితే.. ఆసక్తికరంగా ఒకే రోజు తమ సినిమాలతో పోటాపోటీగా బరిలోకి దిగుతున్నారు.
విక్రమ్ హీరోగా నటించిన '10 ఎండ్రత్తుకుల్ల' ఈ నెల 21న విడుదల కాబోతుంటే.. అదే రోజున నయనతార హీరోయిన్‌గా నటించిన 'నానుమ్ రౌడీదాన్' కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ పోటీలో ఎవరు విజయం సాధిస్తారో తెలియాలంటే ఆ తేది వరకు వేచిచూడాల్సిందే.అన్నట్టు '10 ఎండ్రత్తుకుల్ల' లో సమంత హీరోయిన్‌గా నటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments