నెల రోజుల గ్యాప్‌లో విక్రమ్ చిత్రాలు
Send us your feedback to audioarticles@vaarta.com
శివపుత్రుడు, అపరిచితుడు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ కథానాయకుడు చియాన్ విక్రమ్. ఆ సినిమాల తరువాత తెలుగులోనూ మంచి మార్కెట్‌ను సొంతం చేసుకున్నారు విక్రమ్.
అయితే.. అపరిచితుడు తరువాత వచ్చిన సినిమాలేవీ విక్రమ్‌కు ఆ స్థాయి విజయాన్ని అందించలేదు. అపరిచితుడు దర్శకుడు శంకర్ దర్శకత్వంలోనే విక్రమ్ నటించిన ఐ చిత్రం కూడా ఆ కొరతను తీర్చలేకపోయింది.
ఈ నేపథ్యంలో.. ఈ ఏడాది ద్వితీయార్థంలో రెండు సినిమాలతో సందడి చేయనున్నారు విక్రమ్. ఆ సినిమాలే సామి స్క్వేర్, ధ్రువ నక్షత్రం. హరి దర్శకత్వంలో రూపొందుతున్న సామి స్క్వేర్‌లో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా..
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న ధ్రువ నక్షత్రం సినిమాలో పెళ్ళి చూపులు ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు నెల రోజుల గ్యాప్‌లో ఆగస్టు, సెప్టెంబర్ నెలలలో విడుదల కానున్నాయని సమాచారం. మరి.. ఈ చిత్రాలతోనైనా విక్రమ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments