నెల రోజుల గ్యాప్‌లో విక్ర‌మ్ చిత్రాలు

  • IndiaGlitz, [Monday,June 25 2018]

శివ‌పుత్రుడు, అప‌రిచితుడు చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన త‌మిళ క‌థానాయ‌కుడు చియాన్ విక్ర‌మ్‌. ఆ సినిమాల త‌రువాత తెలుగులోనూ మంచి మార్కెట్‌ను సొంతం చేసుకున్నారు విక్ర‌మ్‌.

అయితే.. అప‌రిచితుడు త‌రువాత వ‌చ్చిన సినిమాలేవీ విక్ర‌మ్‌కు ఆ స్థాయి విజ‌యాన్ని అందించ‌లేదు. అప‌రిచితుడు ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోనే విక్ర‌మ్ న‌టించిన ఐ చిత్రం కూడా ఆ కొర‌త‌ను తీర్చ‌లేక‌పోయింది.

ఈ నేప‌థ్యంలో.. ఈ ఏడాది ద్వితీయార్థంలో రెండు సినిమాల‌తో సంద‌డి చేయ‌నున్నారు విక్ర‌మ్. ఆ సినిమాలే సామి స్క్వేర్‌, ధ్రువ న‌క్ష‌త్రం. హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సామి స్క్వేర్‌లో కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా..

గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ధ్రువ న‌క్ష‌త్రం సినిమాలో పెళ్ళి చూపులు ఫేమ్‌ రీతూ వ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ రెండు సినిమాలు నెల రోజుల గ్యాప్‌లో ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్ నెల‌ల‌లో విడుద‌ల కానున్నాయ‌ని స‌మాచారం. మ‌రి.. ఈ చిత్రాల‌తోనైనా విక్ర‌మ్ మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌స్తారేమో చూడాలి.

More News

సంక్రాంతి కాదు.. వేస‌వి

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఈ ఏడాది వేస‌వికి భ‌ర‌త్ అనే నేను అంటూ ప‌ల‌క‌రించి మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు.

పొలిటిషియ‌న్‌గా సూర్య‌

వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌కు చిరునామాలా నిలిచిన క‌థానాయ‌కుడు సూర్య‌. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును, మార్కెట్‌ను సొంతం చేసుకున్న సూర్య‌.

వంశీ పైడిప‌ల్లి బాట‌లోనే అనిల్ రావిపూడి

తెలుగు ప్రేక్షకులకు దూరమైపోయిన‌ మల్టీస్టారర్ చిత్రాలను మళ్ళీ 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో గుర్తు చేసారు టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ 'దిల్' రాజు.

జెన్యూన్ హిట్ గా 'టిక్ టిక్ టిక్'

ఇండియన్ సినిమా చరిత్రలొనె తొలి స్పెస్ మూవీగా తెరకెక్కిన చిత్రం టిక్ టిక్ టిక్. గత శక్రవారం విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. జయం రవి హీరోగా తెలుగులో తొలి సక్సెస్ ను అందుకున్నారు‌

'పంతం' లాంటి సోష‌ల్ కాజ్ ఉన్న మూవీని నా 25వ సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది - గోపీచంద్‌

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్‌, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కె.చక్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం 'పంతం'.