ఆగష్టు 24న.. విక్రమ్ చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
‘సామి’.. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఇది ఒకటి. 2003లో హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా విక్రమ్ నట విశ్వరూపం చూపించారు. తెలుగులో ‘లక్ష్మీనరసింహ’ పేరుతో బాలకృష్ణ హీరోగా జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో రీమేక్ అయి.. ఇక్కడ కూడా ఘన విజయం సాధించింది. కట్ చేస్తే.. ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత విక్రమ్ ప్రధాన పాత్రలో ‘సామి’కి సీక్వెల్‌గా ‘సామి స్క్వేర్’ను తెరకెక్కించారు హరి.
ఈ మూవీలో తండ్రీకొడుకులుగా నటించిన విక్రమ్.. మరోసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో దర్శనం ఇవ్వనున్నారు. కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈ సినిమాని తమీన్స్ ఫిలిమ్స్ పతాకంపై టి.శిబు నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఆగష్టు 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాణ వర్గాలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. తెలుగులోనూ అదే తేదికి ఈ సినిమా అనువాదం కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com