విక్రమ్ సినిమా ఆడియో రిలీజ్ డేట్..
Send us your feedback to audioarticles@vaarta.com
'ఐ' చిత్రం తర్వాత చియాన్ విక్రమ్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో పత్తు ఎన్రదు కుళ్ళ` సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో సమంత ద్విపాత్రాభినయం చేస్తుందని వినికిడి. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురగదాస్ నిర్మిస్తున్నాడు. సినిమాని అక్టోబర్ 21న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే తమిళంలో ఈ సినిమా ఆడియో విడుదలను సెప్టెంబర్ 17న రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళం కూడా సినిమా ఒకేసారి విడుదలవుతుందా అని తెలియాల్సి ఉంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా విడుదలైన ఈ చిత్రంపై విక్రమ్ చాలా ఆశలనే పెట్టుకున్నాడన చెప్పాలి. మరి చూద్దాం ఈ కౌంట్ డౌన్ టైటిల్ విక్రమ్ ఏ మేర సక్సెస్ తెచ్చి పెడుతుందో...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout