మనం పెట్టిందే చట్టం.. పోసేదే మద్యం : చియాన్ విక్రమ్ ‘‘మహాన్’’ టీజర్ అదిరిందిగా
Send us your feedback to audioarticles@vaarta.com
విలక్షణ నటుడు విక్రమ్‌కు తమిళంలో ఎంత పాపులారిటీ వుందో.. తెలుగులోనూ అంతే. రెండున్నర దశాబ్ధాల క్రితమే ఆయన స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో నటించారు. కానీ ఆ సమయంలో విక్రమ్‌కు అంతగా గుర్తింపు రాలేదు. శివపుత్రుడు నుంచి ఆయన దశ తిరిగింది. మరో విలక్షణ నటుడు సూర్యతో కలిసి ఆయన చేసిన ప్రయోగానికి ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. ఇక ఆ వెంటనే అపరిచితుడు, మల్లన్న, ఐ వంటి వరుస బ్లాక్ బస్టర్లతో దక్షిణాదిలో హయ్యెస్ట్ పెయిడ్ స్టార్స్‌లో ఒకరిగా విక్రమ్ నిలిచారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన నుంచి సరైన హిట్స్ రావడం లేదు. దీంతో మంచి విజయం కోసం చియాన్ వెయిట్ చేస్తున్నారు.
తాజాగా విక్రమ్ నటిస్తున్న సినిమా 'మహాన్'. యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ తో పాటు ఆయన కుమారుడు ధృవ్ కూడా నటిస్తుండటం విశేషం. యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతోన్న మహాన్కి సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, ఫస్ట్ లుక్ వంటివి సినిమాపై హైప్ పెంచింది. తాజాగా సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఎన్నో కుటుంబాల్లో చిచ్చు రేపుతున్న నాటు సారాను నిషేదించాలని పోరాడే ఓ వ్యక్తి తన కొడుకుని (విక్రమ్) ఈ మహమ్మారిపై పోరాడే సామాజిక వేత్తగా చూడాలనుకుంటాడు. కానీ తండ్రి అంచనాలు తలక్రిందులై అతడు మాత్రం పెద్దయిన తరువాత బార్ సిండికేట్‌కు సారథ్యం వహిస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది.. అతనిలో ఎలాంటి మార్పు వచ్చింది అన్నదే స్టోరీ.
డబ్బు, మందు, గొడవలు వంటి సన్నివేశాలను టీజర్లో చూపించారు. టీజర్ చివర్లో ధృవ్ ఎంట్రీని కూడా బాగా కట్ చేశారు. టీజర్ అయితే చాలా ఇంటెన్స్ గా కట్ చేశారు. మరి కార్తీక్ సుబ్బరాజ్.. విక్రమ్‌కు హిట్ ఇస్తాడో లేదో చూడాలి. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నారు. మహాన్‌లో సిమ్రన్, బాబీసింహా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com