విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య 20వ చిత్రం 'థాంక్యూ'

యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెకంటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై థాంక్యూ అనే సినిమా ప్రారంభం కానుంది. అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్న 20వ చిత్ర‌మిది. కింగ్ నాగార్జున పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇష్క్‌, మ‌నం, 24 వంటి వైవిధ్య‌మైన చిత్రాల‌ను రూపొందించిన ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు.

దిల్‌రాజు, శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లు. ‘‘ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని స్టైల్లో స‌రికొత్త‌గా నాగ‌చైత‌న్య‌ను ప్రెజెంట్ చేసేలా సినిమా ఉంటుంది. చైతు, విక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన క్లాసిక్ మూవీ మ‌నం గురించి అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు అదే కాంబోలో సినిమాను చేయనుండ‌టం ఆనందంగా ఉంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాలోని ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తాం’’ అని నిర్మాత‌లు తెలిపారు.