విక్రమ్ కుమార్..మరోసారి
Send us your feedback to audioarticles@vaarta.com
ఒక్కో డైరెక్టర్‌కి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. అలా వైవిధ్యభరితమైన చిత్రాలు చేసే దర్శకుడు విక్రమ్ కె.కుమార్‌కి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. అదేమిటంటే.. తన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రియ అనే పేరు పెట్టడం. తమిళ అనువాద చిత్రం పదమూడు (13)తో మొదలైన ఈ ప్రస్థానం తాజా హలో వరకు కొనసాగుతోంది. 13లో నీతూ చంద్ర పేరు ప్రియ.. ఆ సినిమా విక్రమ్‌కి తొలి విజయాన్ని అందించింది.
అందుకేనేమో ఆ సెంటిమెంట్‌తోనే ఇష్క్‌లో నిత్యా మీనన్‌కి అదే పేరుని పెట్టారు. కట్ చేస్తే.. ఆ సినిమా కూడా మంచి హిట్ అయ్యింది. ఇక మనంలో సమంత చేసిన రెండు పాత్రల్లో ఒక పాత్ర పేరు ప్రియ. రిజల్ట్ ఏమిటో తెలిసిందే. ఇక 24లో సేమ్ టు సేమ్. ఇందులో నిత్యా మీనన్ పాత్ర పేరు ప్రియ.
ఈ సినిమా కూడా హిట్టే. ఇక తాజా చిత్రం హలోలో కథానాయిక కళ్యాణి ప్రియదర్శన్ పాత్ర పేరు ప్రియ. సో.. విక్రమ్ కుమార్‌కి ఉన్న ఈ ప్రియ సెంటిమెంట్.. సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com