విక్ర‌మ్ కుమార్‌..మ‌రోసారి

  • IndiaGlitz, [Tuesday,December 12 2017]

ఒక్కో డైరెక్ట‌ర్‌కి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. అలా వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాలు చేసే ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్‌కి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. అదేమిటంటే.. త‌న సినిమాల్లో హీరోయిన్ల పాత్ర‌ల‌కు ప్రియ అనే పేరు పెట్ట‌డం. త‌మిళ అనువాద చిత్రం ప‌ద‌మూడు (13)తో మొద‌లైన ఈ ప్ర‌స్థానం తాజా హ‌లో వ‌ర‌కు కొన‌సాగుతోంది. 13లో నీతూ చంద్ర పేరు ప్రియ‌.. ఆ సినిమా విక్ర‌మ్‌కి తొలి విజ‌యాన్ని అందించింది.

అందుకేనేమో ఆ సెంటిమెంట్‌తోనే ఇష్క్‌లో నిత్యా మీన‌న్‌కి అదే పేరుని పెట్టారు. క‌ట్ చేస్తే.. ఆ సినిమా కూడా మంచి హిట్ అయ్యింది. ఇక మ‌నంలో స‌మంత చేసిన రెండు పాత్ర‌ల్లో ఒక పాత్ర పేరు ప్రియ‌. రిజ‌ల్ట్ ఏమిటో తెలిసిందే. ఇక 24లో సేమ్ టు సేమ్‌. ఇందులో నిత్యా మీన‌న్ పాత్ర పేరు ప్రియ‌.

ఈ సినిమా కూడా హిట్టే. ఇక తాజా చిత్రం హ‌లోలో క‌థానాయిక క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ పాత్ర పేరు ప్రియ‌. సో.. విక్ర‌మ్ కుమార్‌కి ఉన్న ఈ ప్రియ సెంటిమెంట్‌.. స‌క్సెస్‌ఫుల్‌గా కొన‌సాగుతోంద‌న్న‌మాట‌.