సూపర్ స్టార్, స్టైలీష్ స్టార్ తో విక్రమ్ కుమార్..
Send us your feedback to audioarticles@vaarta.com
13 బి, ఇష్క్ చిత్రాలతో విజయాలు సాధించి మూడు తరాల అక్కినేని హీరోలతో మనం సినిమాని తెరకెక్కించి ఇండస్ట్రీలో అందరి ద్రుష్టి ఆకర్షించిన డైరెక్టర్ విక్రమ్ కుమార్. ప్రస్తుతం సూర్య హీరోగా 24 మూవీ తెరకెక్కిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ గా రూపొందే 24 మూవీలో సూర్య త్రిపాత్రాభినయం చేస్తుండడం విశేషం.
ఇదిలా ఉంటే...డైరెక్టర్ విక్రమ్ కుమార్ తమిళ మీడియాకి ఇచ్చిన ఇంటర్ వ్యూలో...తన నెక్ట్స్ టు ప్రాజెక్ట్స్ తెలుగు హీరోలతోనే ఉంటాయన్నారు. సూపర్ స్టార్ మహేష్, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమాలు చేయనున్నట్టు చెప్పారు. మహేష్ బ్రహ్మోత్సవం తర్వాత మురుగుదాస్ మూవీ చేయనున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం సరైనోడు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్. సో...విక్రమ్ కుమార్ నెక్ట్స్ అల్లు అర్జున్ తో మూవీ చేసే అవకాశం ఉంది. మరి...సరికొత్త కధాంశాలను ఎన్నుకునే విక్రమ్ కుమార్ బన్ని కోసం ఎలాంటి కథ రెడీ చేస్తున్నాడో..? బన్నిని ఎలా చూపిస్తాడో..?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com