విక్రమ్ కుమార్ నెక్ట్స్ టు ప్రాజెక్ట్స్ ఫిక్స్.
Send us your feedback to audioarticles@vaarta.com
13 బి, ఇష్క్, మనం..చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న డైరెక్టర్ విక్రమ్ కుమార్. సూర్యతో విక్రమ్ కుమార్ తెరకెక్కించిన 24 మూవీ ప్రపంచ వ్యాప్తంగా మే 6న రిలీజ్ అవుతుంది. ఈ చిత్రం తర్వాత విక్రమ్ కుమార్ చేసే రెండు చిత్రాలు ఖరారు అయ్యాయి. ఇంతకీ..విక్రమ్ కుమార్ నెక్ట్స్ ఎవరితో సినిమాలు చేస్తున్నారు అనుకుంటున్నారా..?
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో విక్రమ్ కుమార్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగు - తమిళ్ లో రూపొందించే ఈ చిత్రాన్ని డిసెంబర్ లో ప్రారంభించనున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని కూడా తెలుగు - తమిళ్ లో రూపొందించనున్నారు. అల్లు అర్జున్, మహేష్...వీరిద్దరికీ కథ చెప్పడం...అంగీకరించడం జరిగిందని విక్రమ్ కుమార్ మీడియాకి తెలియచేసారు. అయితే...వైవిధ్యమైన కథలతో సినిమాలు తీసే విక్రమ్ కుమార్ బన్ని, మహేష్ లతో ఏ తరహా సినిమాలు చేయనున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com