బన్ని నెక్ట్స్ మూవీ డైరెక్టర్ ఇతనే..
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం సరైనోడు. ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...మనం ఫేం విక్రమ్ కుమార్ ప్రస్తుతం సూర్యతో 24 మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
బన్ని, విక్రమ్ కుమార్ ...వీరిద్దరు సరైనోడు రిలీజ్ తర్వాత ఓ మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే సమ్మర్ నుంచి ఈ మూవీ ప్రారంభించనున్నారు. మరి...డిఫరెంట్ స్టోరీస్ తో ఆకట్టుకునే విక్రమ్ కుమార్ బన్నిని ఎలా చూపిస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com