విక్రమ్ కుమార్.. రెండు క్రేజీ ప్రాజెక్ట్స్

  • IndiaGlitz, [Monday,January 08 2018]

ఇష్క్‌, మ‌నం, 24 చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకున్న ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్‌. ఆయ‌న తాజా చిత్రం హ‌లో ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా.. మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. యుఎస్‌లో ఆయ‌న‌కు మ‌రో మిలియ‌న్ డాల‌ర్ మూవీగా నిలిచింది. ఇదిలా ఉంటే.. హ‌లో త‌రువాత విక్ర‌మ్ రెండు చిత్రాలకు సంతకం చేశాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇవి రెండు కూడా ప్ర‌ముఖ క‌థానాయ‌కులు నిర్మించే చిత్రాలు కావ‌డం విశేషం.

ఈ రెండు చిత్రాల‌ను.. ఇప్ప‌టికే ఆయ‌న చిత్రాల్లో న‌టించిన క‌థానాయ‌కులు నిర్మించ‌నున్నారు. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. సూర్యతో 24 చిత్రాన్ని రూపొందించిన విక్ర‌మ్‌.. కార్తీతో ఏప్రిల్ నుంచి ఓ సినిమా తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలిసింది. దీనికి సూర్య నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. దీని త‌రువాత ఈ ఏడాది చివ‌ర‌లో మ‌రో చిత్రం ప‌ట్టాలెక్కించున్నారు విక్ర‌మ్‌. నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా న‌టించే ఈ సినిమాకి నాగార్జున నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.