విక్రమ్ న్యూ లుక్...

  • IndiaGlitz, [Saturday,November 12 2016]

రీసెంట్‌గా ఇంకొక్క‌డు చిత్రంతో మంచి స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్న చియాన్ విక్ర‌మ్ ఇప్పుడు హ‌రి ద‌ర్శ‌కత్వంలో స్వామి2 సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇంకొక్క‌డు సినిమా 100 కోట్ల రూపాయలు సాధించ‌డంతో విక్ర‌మ్ మార్కెట్ రేంజ్ కూడా పెరిగింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే విక్ర‌మ్ త‌న తదుప‌రి సినిమాలు ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. అయితే కోలీవుడ్ నిర్మాత‌లు విక్ర‌మ్ తో హాలీవుడ్ సినిమా 'డోంట్ బ్రీత్‌'ను రీమేక్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. విక్ర‌మ్ కూడా ఇందులో న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. . థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌తో రూపొందిన ఈ సినిమా హాలీవుడ్‌లో సెన్సేష‌న్ హిట్ట‌య్యింది. అందుకు త‌గిన విధంగా త‌న లుక్‌ను కూడా మార్చుకుంటున్నాడు. గ‌డ్డంతో ఉన్న విక్ర‌మ్ గెట‌ప్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.