25 గెటప్స్‌లో విక్రమ్

  • IndiaGlitz, [Saturday,August 03 2019]

పాత్రలోని కొత్తదనాన్ని నటన పరంగానే కాదు.. లుక్ పరంగానూ కొత్తగా చూపించే ప్రయత్నం చేసే నటుల్లో చియాన్ విక్రమ్ ఒకరు. పాత్రలు, వాటి తీరు తెన్నులను పక్కన పెడితే విక్రమ్ హీరోగా సక్సెస్ కొట్టి చాలా కాలమే అయ్యింది. రీసెంట్‌గా విడుదలైన 'మిస్టర్ కె.కె' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. జయాపజయాలకు అతీతంగా నటనలో వైవిధ్యతను చూపిస్తున్న విక్రమ్‌కు అవకాశాలు మాత్రం తగ్గడం లేదు.

ప్రస్తుతం ఈయన అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో విక్రమ్ 25 గెటప్స్‌లో కనపడబోతున్నారట. ఈ లుక్స్ కోసం అమెరికన్ కంపెనీ ఒకటి వర్క్ చేస్తుందట. ప్రియా భవాని ఇందులో హీరోయిన్‌గా నటించనుంది. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్‌గా నటించే అవకాశాలున్నాయి.

More News

సంక్రాంతి కామెడీ ట్రైన్ సిద్ధమవుతోంది : అనీల్ రావిపూడి

సూపర్‌స్టార్ మహేశ్, డైరెక్టర్ అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`.

రేణుదేశాయ్ తప్పుకున్నారా?

నటి రేణుదేశాయ్, పవన్ కల్యాణ్ నుండి విడిపోయిన తర్వాత దర్శకురాలిగా నిలదొక్కుకొనే ప్రయత్నం చేశారు కానీ..

'ప్రేమభిక్ష' డబ్బింగ్ పూర్తి

ఓం సాయి పిక్చర్స్ బ్యానర్‌లో అనిల్‌, శృతి హీరోహీరోయిన్లుగా.. అశ్వత్‌రెడ్డి, నాగరాజు నిర్మాతలుగా,

విశాల్ అరెస్ట్ అవుతారా?

తమిళ హీరో, నిర్మాతల సంఘం అధ్యక్షడు, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్.

మరో సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్న అఖిల్

`అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలతో హీరోగా గుర్తింపు పొందినా, హిట్ కోసం మాత్రం వెయిట్ చేయాల్సి వస్తుంది అఖిల్ అక్కినేనికి.