విక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడా?
Saturday, July 29, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
విక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టేనా అని కోడంబాక్కం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ గ్రీన్ సిగ్నల్ ఎవరికి అనేగా మీ అనుమానం. వి.ఐ.ఆనంద్‌కి . వి.ఐ.ఆనంద్ తెలుగు వారికి `వీడొక్కడే`, `రంగం`, `బ్రదర్స్`, `అనేకుడు` వంటి సినిమాల ద్వారా పరిచయస్తుడే. `శివపుత్రుడు`, `అపరిచితుడు`, `ఐ` వంటి పలు సినిమాలతో విక్రమ్ కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకే విక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
విక్రమ్ హీరోగా ఓ సోషల్ అవేర్‌నెస్ సినిమాను తీయనున్నాడట కె.వి.ఆనంద్. ఈ సినిమాను ఆరు నెలల్లో తెరకెక్కిస్తారట. `ఐ` సినిమాకు శంకర్ రెండేళ్ల సమయాన్ని వృథా చేశారట. ఆ సినిమా ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చిపెట్టకపోవడంతో ఇకపై ఏ చిత్రానికీ అంత సమయాన్ని వృథా చేయకూడదని నిర్ణయించుకున్నారట విక్రమ్. అందుకే ఈ తాజా చిత్రాన్ని ఆరు నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments