విక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడా?

  • IndiaGlitz, [Saturday,July 29 2017]

విక్ర‌మ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన‌ట్టేనా అని కోడంబాక్కం వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కీ గ్రీన్ సిగ్న‌ల్ ఎవ‌రికి అనేగా మీ అనుమానం. వి.ఐ.ఆనంద్‌కి . వి.ఐ.ఆనంద్ తెలుగు వారికి 'వీడొక్క‌డే', 'రంగం', 'బ్ర‌ద‌ర్స్', 'అనేకుడు' వంటి సినిమాల ద్వారా ప‌రిచ‌య‌స్తుడే. 'శివ‌పుత్రుడు', 'అప‌రిచితుడు', 'ఐ' వంటి ప‌లు సినిమాలతో విక్ర‌మ్ కూడా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మే. ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకే విక్ర‌మ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.
విక్ర‌మ్ హీరోగా ఓ సోష‌ల్ అవేర్‌నెస్ సినిమాను తీయ‌నున్నాడ‌ట కె.వి.ఆనంద్‌. ఈ సినిమాను ఆరు నెల‌ల్లో తెర‌కెక్కిస్తార‌ట‌. 'ఐ' సినిమాకు శంక‌ర్ రెండేళ్ల స‌మ‌యాన్ని వృథా చేశార‌ట‌. ఆ సినిమా ప్రేక్ష‌కుల్లో మంచి పేరు తెచ్చిపెట్ట‌క‌పోవ‌డంతో ఇక‌పై ఏ చిత్రానికీ అంత స‌మయాన్ని వృథా చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నార‌ట విక్ర‌మ్‌. అందుకే ఈ తాజా చిత్రాన్ని ఆరు నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.