మార్చి నుండి విక్రమ్...
Send us your feedback to audioarticles@vaarta.com
`ఇంకొక్కడు` వంటి స్పై థ్రిల్లర్‌తో మంచి సక్సెస్ అందుకున్న చియాన్ విక్రమ్ ఇప్పుడు విజయ్ చంద్రశేఖర్ సినిమా చేస్తున్నాడు. అలాగే హరి దర్శకత్వంలో `సామి2` సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. దీనితో పాటు దర్శకుడు గౌతమ్‌మీనన్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడు. లవ్ సబ్జెక్ట్స్‌తో పాటు యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించే గౌతమ్‌మీనన్ ఈసారి విక్రమ్‌ను డిఫరెంట్‌గా చూపించనున్నాడు.
ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి నుండి ప్రారంభం కానుందట. ఈలోపు విక్రమ్ దాదాపు సామి2 చిత్రీకరణను పూర్తి చేసేస్తాడట. మరో విషయం ఏమిటంటే ఈ సినిమాను ఎక్కువ శాతం అమెరికాలో చిత్రీకరిస్తారట. ఈ సినిమాకు ధృవ నక్షత్రం అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments