నాలుగోసారి ఆమెకి ఛాన్స్ ఇచ్చిన‌ విక్ర‌మ్‌

  • IndiaGlitz, [Thursday,March 24 2016]

'మ‌నం' చిత్రంతో తెలుగువారికి బాగా ద‌గ్గ‌రైన ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్‌.. ప్ర‌స్తుతం సూర్య‌తో '24' అనే సైంటిఫిక్ ఫిక్ష‌న్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా విక్ర‌మ్‌కి ద‌ర్శ‌కుడిగా ఆర‌వ చిత్రం. ఈ సినిమా కోసం ఓ అంశాన్ని విక్ర‌మ్ నాలుగోసారి రిపీట్ చేస్తున్నాడు.

ఇంత‌కీ అదేమిటంటే.. 'నీరాజ‌నం', 'నాయ‌కుడు' వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టించిన నాటి క‌థానాయిక శ‌ర‌ణ్య‌ని త‌న సినిమాల కోసం కీల‌క పాత్ర‌ల్లో ఎంచుకోవ‌డం. త‌మిళ చిత్రం 'అలై' కోసం మొద‌టిసారి ఆమెతో కీల‌క పాత్ర చేయించిన‌ విక్ర‌మ్‌.. ఆ త‌రువాత '13 బి', 'మ‌నం'లోనూ ఆమెకి ముఖ్య పాత్ర‌ల‌ను ఇచ్చాడు. ఇక‌ '24' సంగ‌తికి వ‌స్తే.. అత్యంత కీల‌క‌మైన వేషంలో శ‌ర‌ణ్య క‌నిపించ‌నుంద‌ట‌. మొత్త‌మ్మీద‌.. శ‌ర‌ణ్య‌లాంటి మంచి న‌టికి త‌న సినిమాల్లో త‌రుచుగా అవ‌కాశాలిస్తూ ప్రోత్స‌హిస్తున్నాడు విక్ర‌మ్ కుమార్‌. '24' వేస‌వి కానుక‌గా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

More News

'అ..ఆ..'తో  బ్రేక్ ప‌డుతుందా?

'ఇష్క్‌', 'గుండె జారి గ‌ల్లంత‌య్యిందే' చిత్రాల‌తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు నితిన్‌. అయితే.. ఆ త‌రువాత న‌టించిన సినిమాలే నితిన్‌కి ఏ మాత్రం అచ్చి రాలేదు. ఈ నేప‌థ్యంలో త‌న కొత్త చిత్రం 'అ..ఆ.'.పై బోలెడు ఆశ‌ల‌ను పెట్టుకున్నాడు ఈ యువ క‌థానాయ‌కుడు.

అలా..చేస్తే త‌ప్పు ఏమిటి అంటున్న వంశీ పైడిప‌ల్లి..

మున్నా చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై...తొలి చిత్రంతో విజ‌యం సాధించ‌లేక‌పోయినా బృందావ‌నం, ఎవ‌డు చిత్రాల‌తో స‌క్సెస్ సాధించిన డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి. తాజాగా నాగార్జున - కార్తీ - త‌మ‌న్నా కాంబినేష‌న్లో ఊపిరి చిత్రాన్ని తెర‌కెక్కించారు.

చిరు - నాగ్ త‌ర్వాతే బాల‌య్య‌..

మెగాస్టార్ చిరంజీవి - కింగ్ నాగార్జున త‌ర్వాతే న‌ట‌సింహం బాల‌య్య‌. ఇంత‌కీ ఏ విష‌యంలో అనుకుంటున్నారా...ఇండియా టుడే క‌వ‌ర్ పేజీ పై  బాల‌య్య లెజండ‌రీ పోస్ట‌ర్ వ‌చ్చింది. ఈ స్పెష‌ల్ ఎడిష‌న్ కి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఈరోజు 3 గంట‌ల‌కు స‌చివాల‌యంలో విడుద‌ల చేయ‌నున్నారు.

చైతు మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

నాగ చైత‌న్య హీరోగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపో. ఈ చిత్రంలో చైతు స‌ర‌స‌న మంజిమా మోహ‌న్ న‌టిస్తున్నారు. ఈ చిత్రం పాట‌లు మిన‌హా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సావిత్రి'

యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తెచ్చుకున్న వారిలో నారా రోహిత్ ఒకరు. తొలి చిత్రం బాణం నుండి విభిన్నమైన కథలు ఎంపికలో కొత్తవాళ్ళకి చాన్స్ ఇవ్వటం లో నారా రోహిత్ ఎప్పుడు ముందుంటున్నారు.