ఘనంగా హీరో విక్రమ్ కుమార్తె నిశ్చితార్థం

  • IndiaGlitz, [Monday,July 11 2016]

డిఫ‌రెంట్ క‌థ‌ల‌తోనే కాదు, గెట‌ప్‌ల‌తో కూడా ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తెచ్చుకున్న హీరో చియాన్ విక్ర‌మ్‌. చూడ‌టానికి చాలా యంగ్ లుక్‌తో క‌న‌ప‌డే విక్ర‌మ్ వ‌య‌సు యాభై అంటే ఎవ‌రు న‌మ్మ‌రేమో.కానీ అదే నిజం ఆయ‌నకు అక్షిత అనే పెళ్లీడు కుమార్తె ఉంది. ఆమెకు త‌మిళ‌నాడు మాజీ సీఎం ముని మ‌న‌వ‌డు మ‌ను రంజిత్‌తో నిశ్చితార్థం జ‌రిగింది. ఈ వేడుకకు డైరెక్ట‌ర్ శంక‌ర్ స‌హా ప‌లు సినీ, రాజ‌కీయ సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారు. గ‌త కొంత‌కాలంగా అక్షిత‌, మ‌ను రంజిత్‌లు ప్రేమించుకుంటున్నారు. ఎట్టకేల‌కు వీరి ప్రేమ వ్య‌వ‌హారం ఓ కొలిక్కి వ‌చ్చింది. వ‌చ్చే ఏడాది వీరి వివాహం జ‌రుగుతుంద‌ని స‌మాచారం. హీరో విక్రమ్ ఇప్పుడు ఇంకొక్కడు అనే చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే సినిమా విడుదల కానుంది.