చివ‌రి ద‌శ‌లో విక్ర‌మ్ క్రేజీ ప్రాజెక్ట్‌

  • IndiaGlitz, [Sunday,January 07 2018]

వైవిధ్య‌భరితమైన కథాంశాలతో పోలీస్ చిత్రాలను తెరకెక్కించడంలో ద‌ర్శ‌కుడు గౌతమ్ మీనన్ సిద్ధ హస్తుడు. క‌థ ఏదైనా.. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి విల‌క్ష‌ణ న‌ట‌న‌తో మెప్పించడంలో చియాన్ విక్రమ్ పెట్టింది పేరు. అలాంటి వీరిద్దరి తొలి కాంబినేషన్‌లో 'ధ్రువ‌ నచ్చత్తిరమ్' పేరుతో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా గత ఏడాది కాలంగా ఏడు దేశాల్లో చిత్రీకరణ జరుపుకుంది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ ట్రైలర్‌ని త్వరలోనే విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే...ఈ నెల 25వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఈ చిత్రం చివరి షెడ్యూల్ జరుపుకోనుందని సమాచారం.

ఈ చిత్రంలో విక్రమ్ సరసన పెళ్ళి చూపులు ఫేమ్ రీతూ వర్మ కథానాయికగా నటిస్తుండ‌గా.. ఐశ్వర్య రాజేష్, పార్తిబన్, సిమ్రాన్, రాధిక శరత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారిస్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్న‌ ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

More News

వ‌రుస సినిమాల‌తో సూర్య‌

తమిళ స్టార్ నటుడు సూర్య నటించిన తాజా త‌మిళ చిత్రం 'తాన సేరంద కూటం'. ఈ చిత్రాన్ని 'గ్యాంగ్' పేరుతో తెలుగులో అనువదించారు. ఈ రెండు వెర్ష‌న్‌లు సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న‌ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

36వ ఎంట్రీగా 'హ‌లో'

అక్కినేని అఖిల్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరోహీరోయిన్లుగా మ‌నం, 24 చిత్రాల ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం హ‌లో. అక్కినేని నాగార్జున ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ సినిమా డిసెంబ‌ర్ 22న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.

కోటీశ్వ‌రుడి కూతురిగా లావ‌ణ్య‌

అందాల రాక్ష‌సితో క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన లావ‌ణ్య త్రిపాఠి.. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, సోగ్గాడే చిన్ని నాయనా, శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు వంటి చిత్రాల‌తో స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

బి.ఎ.రాజుకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన సూర్య‌

సీనియ‌ర్ పాత్రికేయుడు, సూప‌ర్‌హిట్ ప‌త్రిక ఎడిట‌ర్‌, నిర్మాత బి.ఎ.రాజు పుట్టిన‌రోజు జ‌న‌వ‌రి 7. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మక్షంలో జ‌రిగిన పుట్టిన‌రోజు సెల‌బ్రేష‌న్స్‌లో బి.ఎ.రాజు బ‌ర్త్‌డే కేక్‌ను క‌ట్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హీరో సూర్య‌..బి.ఎ.రాజుకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.

విష్ణు మంచు ఆచారి అమెరికా యాత్ర టీజర్ విడుదల!

విష్ణు మంచు హీరోగా నటించిన 'ఆచారి అమెరికా యాత్ర' చిత్ర టీజర్ విడుదలైనది. కామెడీ ప్రధానంగా సాగే టీజర్ అందరిని ఆకట్టుకుంటోంది. బ్రహ్మానందం, విష్ణుల కాంబినేషన్ లో వస్తుండటంతో చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.