ఆకట్టుకుంటోన్న విక్రమ్‌ లేటెస్ట్‌ మూవీ 'కోబ్రా' లుక్

  • IndiaGlitz, [Friday,December 25 2020]

చియాన్ విక్ర‌మ్ 58వ సినిమా 'కోబ్రా' షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. 'అంజ‌లి సీబీఐ ఆఫీస‌ర్'(ఇమైకా నొడిగ‌ల్‌) ఫేమ్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో విక్ర‌మ్ స‌ర‌స‌న కె.జి.య‌ఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్ర‌ముఖ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ ఇందులో విలన్‌గా న‌టిస్తుండ‌టం విశేషం. ఎస్‌.ఎస్‌.ల‌లిత్ కుమార్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. క్రిస్మస్‌ సందర్భంగా ఈ సినిమాలో విక్రమ్‌ పాత్రకు సంబంధించిన ఓ లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. కళ్లద్దాలు పెట్టుకుని, ఎక్కువ జుత్తు పెంచుకున్న విక్రమ్‌ సగం ముఖం కనపడుతుంటే మరో సగం ముఖంలో అంకెలు, కొన్ని అక్షరాలు కనిపిస్తున్నాయి.

పాత్ర ప‌రంగా, లుక్ పరంగానూ కొత్తగా చూపించే ప్రయత్నం చేసే నటుల్లో ఒక‌డైన విక్ర‌మ్ ఈ సినిమాలో 25 గెట‌ప్స్‌లో క‌నిపించ‌బోతున్నార‌ని టాక్‌. ఈ లుక్స్ కోసం అమెరికన్ కంపెనీ ఒకటి వర్క్ చేస్తుంది.ఈ సినిమాతో పాటు విక్ర‌మ్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమాలోనూ న‌టిస్తున్నారు. చాలా కాలంగా మంచి బ్రేక్ కోసం వేచి చూస్తున్న విక్ర‌మ్ ఈ సినిమాపై భారీ ఆశ‌ల‌నే పెట్టుకున్నాడు. తెలుగు నిర్మాత‌లు ఈ సినిమా తెలుగు హ‌క్కుల కోసం సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ విష‌యంలో ఓ క్లారిటీ రానుంది.

More News

ఆ 8 మందిలో ఐదుగురి గుర్తింపు.. మరో ముగ్గురు ఎవరు?

ఏపీలో కొత్త రకం కరోనా వైరస్ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే.

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం: సీపీ సజ్జనార్‌

కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే ఈ ఏడాది మార్చి నుంచి అన్ని పండుగలపై ఆంక్షలు కొనసాగాయి.

బ్రేకింగ్: రజినీకాంత్‌కు తీవ్ర అస్వస్థత.. అపోలోకి తరలింపు

సూపర్ స్టార్ రజినీకాంత్‌ తీవ్ర అస్వస్థతకు గురయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో

టక్ జగదీష్’ ఫస్ట్‌లుక్‌ విడుదల..

ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని చేస్తున్న చిత్రం ‘టక్ జగదీష్’. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి అద్భుతమైన హిట్స్ ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమైన థియేటర్లు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు థియేటర్లు తెరుచుకుంటున్నాయి. మంచి రోజు కావడంతో థియేటర్ల యాజమాన్యం నేటి నుంచి థియేటర్లను పునః ప్రారంభించింది.