సక్సెస్ ను తండ్రికి డేడికేట్ చేసిన హీరో
- IndiaGlitz, [Monday,August 10 2015]
ప్రతి వ్యక్తి సక్సెస్ కి ఒకరు కారణంగా ఉంటారు. ఆ సక్సెస్ కి వారు కారణం అయినా ఎప్పుడూ లైమ్ లైట్ లోకి రారు. ఎక్కడా మనకు కనపడరు. అలాంటి వ్యక్తే హీరో విక్రమ్ తండ్రి. నా తండ్రికి సినిమాలంటే చాలా ఇష్టం. సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశారు.
అయితే ఏదో సాధించాలనుకున్న ఆయన దాన్ని సాధించలేకపోయారు. ఆ అసంతృప్తి ఆయనలో ఉండేది. అది చూసిన నాకు సినిమాలంటే మరింత ఆసక్తి పెరిగేలా చేసింది. ఏదేని కొత్తగా చేయాలనే తపన ఆయన నుండే చూసి నేర్చుకున్నాను. ఇప్పటి వరకు నేను సాధించిన సక్సెస్ ను నా రియల్ హీరో అయిన నా తండ్రికి అంకితం చేస్తున్నానంటూ సోషల్ మీడియాలో తెలియజేశాడు.