Vikram Goud: టీబీజేపీకి విక్రమ్ గౌడ్ రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరిక..!

  • IndiaGlitz, [Thursday,January 11 2024]

పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. గ్రేటర్ హైదరాబాద్‌లో కీలక నేత దివంగత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపించారు. పార్టీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో ఈ లేఖలో ఆయన వివరించారు.

మూడేళ్లుగా పార్టీ బలోపేతం కోసం క్రమశిక్షణగా పనిచేసినా.. గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో కొత్త వారిని అంటరానివారిగా చూస్తున్నారని వాపోయారు. క్రమశిక్షణకు మారు పేరు అంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే కొందరు చోద్యం చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాబలం లేని వారికి పెద్దపీట వేసి వారి కింద పనిచేయాలని చెబుతున్నారని విమర్శించారు. ఎన్నికల తర్వాత ఓటమికి, నేతల అసంతృప్తిపై ఎవరూ బాధ్యత తీసుకోలేదని.. ఆ ఆవేదనతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నన్నట్లు లేఖలో వెల్లడించారు.

కాగా విక్రమ్ గౌడ్ 2014, 2018 ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి రాజాసింగ్ చేతిలో ఓడిపోయారు. అనంతరం 2020లో అదే పార్టీలో చేరారు. అయితే 2023 ఎన్నికల్లో గోషామహల్ స్థానం ఆశించారు. కానీ కమలం పెద్దలు మళ్లీ రాజాసింగ్‌కే సీటు కేటాయించడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లోనైనా పోటీ చేయాలనుకున్నారు. బీజేపీ అధిష్టానం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో మనస్థాపం చెందిన ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తిరిగి సొంత గూటికి చేరనున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంతా కాంగ్రెస్ గాలి వీసినా.. గ్రేటర్ నియోజకవర్గాల్లో మాత్రం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. దీంతో గ్రేటర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర పార్టీలో అసంతృప్తులకు ఉన్న బలమైన నేతలకు గాలం వేస్తున్నారు. ఈ క్రమంలోనే విక్రమ్ గౌడ్‌ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. మొత్తానికి గ్రేటర్‌లో బలమైన నేత అయిన విక్రమ్ గౌడ్ రాజీనామా బీజేపీకి కొంతమేర మైనస్ అనే చెప్పాలి.

More News

Mohith Reddy: దొంగ ఓట్లతో గెలవాల్సిన ఖర్మ పట్టలేదు.. చంద్రబాబు ఆరోపణలపై మోహిత్ రెడ్డి ఫైర్..

చంద్రగిరి నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు చేర్పించినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నిరూపిస్తే నామినేషన్‌ కూడా వేయనని తుడా చైర్మన్, చంద్రగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి

Kesineni Nani: కేశినేని నానిపై టీడీపీ నేతలు కౌంటర్ ఎటాక్.. వైసీపీ కోవర్టు అంటూ ఆరోపణలు..

టీడీపీకి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సీఎం జగన్‌ను కలిసిన అనంతరం చంద్రబాబు

Traffic Challans: తెలంగాణ వాహనదారులకు శుభవార్త.. పెండింగ్ చలాన్ల చెల్లింపు గడువు పెంపు..

వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. పెండింగ్ చలాన్ల గడువును ఈనెల 31వ తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Kesineni Nani: చంద్రబాబు పచ్చి మోసగాడు.. కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు..

టీడీపీ అధినేత చంద్రబాబు పచ్చి మోసగాడు అని విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కేశినేని నాని, ఆయన కుమార్తె సీఎం జగన్‌ను కలిశారు.

BRS MLAs: మధురై కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. రీజన్ ఇదే..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి తమిళనాడులోని మధురై కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుతం వీరు కోర్టులో కూర్చుని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.