ఎన్టీఆర్ తప్పించుకోవడానికే, చరణ్ లుక్ పై నో కామెంట్.. ఆఫ్రికా అడవుల్లో మహేష్
Send us your feedback to audioarticles@vaarta.com
రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ మరోసారి ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో విజయేంద్ర ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ పాత్రల గురించి స్పందించారు. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోలో కొన్ని సెకండ్ల పాటు ముస్లిం లుక్ లో కనిపిస్తాడు.
ఇదీ చదవండి: జులై30న విడుదలవుతున్న`ఇష్క్`
కొమరం భీంకి, ముస్లిం గెటప్ కు సంబంధం ఏంటి ? రాజమౌళి చరిత్రని వక్రీకరిస్తున్నారు అంటూ టీజర్ రిలీజైనప్పుడు విమర్శలు వచ్చాయి. తాజాగా విజయేంద్ర ప్రసాద్ దానిపై స్పదించారు. కొమరం భీం నిజాంకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అలాంటప్పుడు కొమరం భీం ముస్లిం గెటప్ లో ఉంటేనే వారి నుంచి తప్పించుకోవడం వీలవుతుంది కదా అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.
ఇక రాంచరణ్ అల్లూరి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ పోలీస్ డ్రెస్ లో కనిపించడం టీజర్ లో చూశాం. దీనిపై కూడా విమర్శలు వచ్చాయి. అల్లూరి సీతారామరాజుకి, పోలీస్ యూనిఫామ్ కి సంబంధం ఏంటి అని ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై మాత్రం విజయేంద్ర ప్రసాద్ నో కామెంట్ అనేశారు. సినిమా చూసే తెలుసుకోవాలి అని అన్నారు. రాంచరణ్ పోలీస్ డ్రెస్ లో కనిపించడం కథలో భాగం అని అన్నారు.
ఈ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ మరో కీలక విషయం రివీల్ చేశారు. రాజమౌళి తదుపరి తెరకెక్కించబోయే చిత్రం మహేష్ బాబుతో. సాధారణంగా రాజమౌళి ఒక సినిమా చేస్తున్నప్పుడు నెక్స్ట్ మూవీ గురించి ఆలోచించడు. కానీ లాక్ డౌన్ వల్ల ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ సమయంలో గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ మూవీ గురించి ఆలోచించేందుకు టైం దొరికింది.
అందుకే మహేష్ బాబు సినిమా కథ గురించి చర్చించుకున్నట్లు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. కానీ కథ ఇంకా ఫైనల్ కాలేదు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ థ్రిల్లర్ గా కథ రాయాలని మైండ్ లో ఉంది. సౌత్ ఆఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ పుస్తకాలు తనకు, రాజమౌళికి బాగా ఇష్టం అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రస్తుతం వాటిపై అధ్యయనం చేస్తున్నట్లు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments