'ఈగ' తేదికే వ‌స్తున్న 'విజేత‌'

  • IndiaGlitz, [Thursday,June 14 2018]

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా న‌టించిన తొలి చిత్రం 'విజేత‌'. రాకేశ్ శ‌శి దర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాత సాయి కొర్ర‌పాటి ఈ సినిమాని నిర్మించారు. మాళ‌వికా నాయ‌ర్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమాలో ముర‌ళీ శ‌ర్మ ఓ కీల‌క పాత్ర పోషించారు. హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రాన్ని జూలైలో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాని ఈగ చిత్రం విడుద‌ల తేది అయిన జూలై 6న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన 'ఈగ' చిత్రాన్ని కూడా నిర్మించింది సాయి కొర్ర‌పాటి కావ‌డం విశేషం. మ‌రి క‌లిసొచ్చిన తేదికే త‌న తాజా చిత్రంతో వ‌స్తున్న సాయి కొర్ర‌పాటి ఖాతాలో మ‌రో మంచి విజ‌యం చేరుతుందేమో చూడాలి.