close
Choose your channels

ఒక్క సినిమాకే ఇక సెలవంటే ఎలా రాములమ్మా..!?

Monday, February 3, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఒక్క సినిమాకే ఇక సెలవంటే ఎలా రాములమ్మా..!?

టాలీవుడ్ సీనియర్‌ నటి విజయశాంతి అలియాస్ రాములమ్మ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో విజయశాంతి మళ్లీ మేకప్ వేసుకోన్నారు. మహేశ్ సినిమాలో రాములక్క కీలక పాత్రలో కనిపించి తనలో నటన.. అందం, ఐశ్వర్యం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకుంది. ఒకట్రెండు కాదు.. ఏకంగా 13 ఏళ్ల తర్వాత సినిమాల్లో నటిస్తుండటంతో.. ఆమె యాక్టంగ్ పరంగా ఎలా నటిస్తుందో ఏమో అని సినీ ప్రియులు, వీరాభిమానులకు అనుమానాలుండేవి.. అయితే రీ ఎంట్రీ సినిమాతోనే అదుర్స్ అనిపించింది. అయితే ఇక రాములమ్మ మల్లీ క్రీజులోకి వచ్చేసిందని.. ఇక వరుస సినిమాలేనని అందరూ భావించారు. ఈ గ్యాప్‌లో ఏం జరిగిందో ఏమో అర్థం కావట్లేదు కానీ.. ట్విట్టర్ వేదికగా ఆమె వరుస ట్వీట్లతో అదర్నీ ఆలోచింపజేసింది. ఇంతకీ ఆమె చేసిన ట్వీట్స్ సారాంశమేమిటో ఇప్పుడు చూద్దాం.

ఇప్పటికి ఇక సెలవు!?

‘సరిలేరు నీకెవ్వరు ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించిన, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు. నా నట ప్రస్ధానానికి 1979 కళ్ళుకుల్ ఇరమ్,కిలాడి కృష్ణుడు నుండి నేటి 2020 సరిలేరునీకెవ్వరు వరకు ఆగౌరవాన్ని అందించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు. ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం... మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో.. లేదో నాకు కూడా తెలియదు.. ఇప్పటికి ఇక శెలవు. మనసు నిండిన మీ ఆదరణకు,

నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు’ అని రాములమ్మ ట్విట్టర్‌లో రాసుకొచ్చింది.

అయితే.. విజయశాంతి రీ ఎంట్రీ ఇచ్చిన ఒక్కటంటే ఒక్క సినిమాకే ఇలా చేస్తే ఎలా ఉంది..? ఆఫర్లు రావట్లేదని అలా అన్నదా..? లేకుంటే ఆఫర్ల కోసమే ఇలా చేసిందా..? లేదా రాజకీయల పరంగా ఇకపై రాములమ్మ బిజీ కానుందా..? లేకుంటే మరేమైనా కారణాలున్నాయా..? అనేది తెలియాల్సి ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment