అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన విజయ్‌కాంత్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనను చేర్చించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు డీఎండీకే వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. కాగా.. రొటీన్ హెల్త్ చెకప్ కోసం విజయ్‌కాంత్ ఆసుపత్రిలో చేరినట్టు వారు చెప్పారు. ప్రస్తుతం విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
ఒకటి రెండు రోజుల చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అవుతారని కూడా డీఎండీకే వర్గాలు తెలిపాయి. కాగా.. డీఎంకే అధినేత గత కొద్దికాలంగా పలు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. 2020 సెప్టెంబర్‌లో విజయకాంత్‌కు కరోనా సోకింది. దీంతో ఆయన కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం కోలుకున్నారు. విజయకాంత్ తర్వాత ఆయన భార్య ప్రేమలత కూడా కోవిడ్ బారిన పడి, అక్టోబర్ 2న ఆసుపత్రి నుంచి డిశ్చార్చి అయ్యారు.
కాగా.. ఇప్పటిలాగే గతంలో కూడా విజయ్‌కాంత్ శ్వాసకోస సంబంధిత సమస్యతో బాధపడ్డారు. గత నెల 23న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన డీఎండీకే చేరి రెండు రోజుల పాటు చికిత్స తీసుకొని డిశ్చార్జి అయ్యారు. అయితే, ఆయన మళ్లీ అస్వస్థతకు గురవ్వడంతో మరోసారి ఆసుపత్రి పాలయ్యారు. 20 రోజుల్లో విజయ్‌కాంత్ ఆసుపత్రి పాలవడం ఇది రెండోసారి. గతంలోనూ ఆయన విదేశాలకు వెళ్లి మరీ వైద్య చికిత్స తీసుకున్నారు. అనారోగ్యంతో ఆయన రాజకీయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనలేకపోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments