'సంజీవని' చిత్రం అద్బుత విజయాన్ని సాధిస్తుంది - కె.వి.విజయేంద్రప్రసాద్
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి చిత్రం తరువాత ఎక్కువ శాతం గ్రాఫిక్స్ తో వస్తున్న చిత్రం సంజీవని.. ఈ చిత్రాన్ని జి.నివాస్ ప్రోడ్యూసర్ గా, రవి వీడే దర్శకుడి గా మనోజ్ చంద్ర, అనురాగ్ దేవ్, శ్వేత ప్రధాన పాత్రల్లో అనేకమంది హాలీవుడ్ టెక్నీషియన్స్ దాదాపు రెండు సంవత్సరాల పాటు పని చేసి, మొట్టమొదటిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని సమర్థవంతంగా వాడి,దాదాపు 1000 కి పైగా వి.ఎఫ్.ఎక్స్ షాట్స్ తో అత్యంత భారీగా నివాస్ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించారు. .. ప్రస్తుతం ఫైనల్ మిక్సింగ్ లో వుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ సంస్థ శ్రీ లక్ష్మిపిక్చర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా మే నెలాఖరున విడుదల కి సన్నాహలు చేస్తున్నారు.
ఇటీవలే ఈచిత్రం యెక్క ట్రైలర్ ని విడుదల చేయగా అనూహ్యమైన స్పందన రావటం శుభపరిణామం గా యూనిట్ అంతా భావిస్తున్నారు. ఇదే కాకుండా ట్రేడ్ వర్గాల నుండి విపరీతమైన ఎక్వైరీలు వస్తుండటంతో నిర్మాతలు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ చిత్రం ఆడియోని ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా చాటి చెప్పిన బాహుబలి కథా రచయిత ప్రముఖ దర్శకుడు కె.వి.విజయేంద్రప్రసాద్ గారు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో ప్రముక సంగీత దర్శకడు కె.యం.రాధాకృష్ణ గారు, ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి గారు, డైరక్టర్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణా శ్రీ మామిడి హరికృష్ణ గారు, ఆల్ ఇండియా రేడియో సీనియర్ ఎనౌన్స్ర్ శ్రీలక్ష్మీ ఐనంపూడి గారు ముఖ్యఅతిధులుగా హజరయ్యారు.
ఈ సందర్బంగా కె.వి.విజయేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ.. ఈ చిత్రం యెక్క విజువల్స్ నేను చూశాను. గత రెండు సంవత్సరాలుగా వీరంతా యంగ్ బ్యాచ్ చాలా కష్టపడి చేశారు. కష్టపడి చేయటమే కాదు అంతే చక్కగా అవుట్పుట్ ని సాందించారు. టైటిల్ సంజీవని అని పెట్టడంలోనే వీరంతా సక్సస్ సాదించేశారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని నమ్మకం నాకుంది.. ఆల్ ద బెస్ట్ లు ఎంటైర్ యూనిట్.. అని అన్నారు.
ప్రముఖ సంగీత దర్శకడు కె.యం.రాధాకృష్ణ గారు మాట్లాడుతూ.. నాకు ఈ యూనిట్ చాలా పరచయం వుంది. వీరంతా చాలా ఫ్యాషనేట్ గా కష్టపడి చిత్రాన్ని చేశారు. మ్యూజిక్ కొసం శ్రవణ్ ఇష్టం తో కష్టపడి చేశాడు.. ఆడియో చాలా బావుంటుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కొరుకుంటున్నాను.. అని అన్నారు.
శ్రీ మామిడి హరికృష్ణ గారు మాట్లాడుతూ.. మన తెలంగాణా భువనగిరి లో ఈ చిత్రం షూటింగ్ చేశారంటే ఎవరూ నమ్మరు. అంత పెద్ద రాక్ ఎక్కడా వుండదు కూడా.. ఈచిత్రం చూసిన తరువాత ప్రతిఓక్కరూ తెలంగాణాలో షూటింగ్ లకి వస్తారు. ప్రపంచ ప్రఖ్యాత గాంచిన రచయిత శ్రీ విజయేంద్రప్రసాద్ గారు ఈ చిత్ర యూనిట్ ని ఆశీర్వదించడానికి రావటమే వీరందరి సక్సస్.. విడుదలయ్యాక చిత్రం మంచి విజయం సాధించాలని కొరుకుంటున్నాను. అని అన్నారు
శ్రీ లక్ష్మి ఐనంపూడి గారు మాట్లాడుతూ.. 24 విభాగాల్లో రైటర్స్ విభాగం నుండి విజయేంద్రప్రసాద్ గారు.. సంగీతం నుండి రాధాకృష్ణ గారు, గేయరచయితల నుండి రామజోగయ్య శాస్త్రి గారు.. బెస్ట్ క్రిటిక్ వర్గం నుండి హరికృష్ణ గారు రావటమే ఈ చిత్రం విజయం సాదించినంత ఆనందంగా వుంది. ఈ సినిమా మంచి విజయం సాదించి వీరందరికి మంచి జరగాలని కొరుకుంటున్నాను.. అని అన్నారు .
ఈ సందర్భంగా దర్శకుడు రవి వీడే మాట్లాడుతూ.. ప్రపంచంలో రామాయణం బేస్ చేసుకుని ఎన్ని కథలు వచ్చినా కూడా సుందరకాండ పర్వం అనేది మన సినీ పరిశ్రమకి కమర్షియల్ ఎలిమెంట్ అని చెప్పుకోవాలి. ఈ సుందరకాండ ని ఇష్టపడని వారుండరు.. ఎందుకంటే దీంట్లో అందరి ఆరాధ్యదైవం శ్రీ ఆంజనేయడు వుంటాడు.. రామాయణాన్ని తన భుజస్కందాలపై మెసి నడిపించాడు.. ఈరోజు మా సంజీవని చిత్రం ఆడియోకి వచ్చిన శ్రీ విజయేంద్రప్రసాద్ గారు కూడా మా చిత్రానికి ఆంజనేయులంతవారు.. ఇప్పటికి నమ్మలేకపోతున్నా ఆయన మా చిత్ర యూనిట్ ని బ్లెస్ చేశారంటే.. ఆయనికి నా హ్రుదయపూర్వక దన్యవాదాలు..
అలాగే ఈ కార్కక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిధులందరికి నా ప్రత్యేఖ దన్యవాదాలు తెలుపుతున్నాను. మా చిత్రం విషయానికోస్తే మొట్టమొదటిసారిగా భారతదేశంలో హాలీవుడ్ టెక్నీషియన్స్ తో కలిసి రెండు సంవత్సరాలు,తెలుగులో మెషన్ క్యాప్చర్ టెక్నాలజీని వాడి, దాదాపు1000 కి పైగా VFX షాట్స్ తో, ఇండియాలోనేకాకుండా కెనడా, ఆఫ్రికా, నేపాల్ దేశాల్లో అత్యద్భుతమైన లొకేషన్స్ లో అత్యంత కష్టతరమైనా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హాలీవుడ్ పిక్చర్ అనేరేంజి లో భారీ గ్రాఫిక్స్ తో నిర్మించిన చిత్రం మా సంజీవని. ఈ చిత్రం యెక్క టీజర్ ని విడుదల చేశాము. టీజర్ చూసిన వారంతా ఇంత క్వాలిటి గ్రాఫిక్స్ ని ఇండియన్ ఫిల్మ్స్ లో చూడలేదని ప్రశంశిస్తున్నారు. మా సినిమా కి వచ్చిన ప్రేక్షకుడు మరో లోకంలో విహరిస్తాడనేది మేము గ్యారంటిగా చెప్పగలను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకి సిద్దంగా వుంది. జూన్ లో మా చిత్రం విడుదల కానుంది.
మెట్టమెదటిసారి భారీ గ్రాఫిక్స్ చిత్రం గా చిన్న పిల్లల్ని,ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించే చిత్రం గా మా సంజీవని మొదటి స్థానంలో వుండబోతుంది. మనోజ్ చంద్ర, అనురాగ్ దేవ్, శ్వేత లు ప్రధాన పాత్రల్లో నటించగా శ్రవణ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మా చిత్రాన్ని ప్రముఖ సంస్థ శ్రీ లక్ష్మి పిక్చర్స్ వారు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సమ్మర్ లో వచ్చే ప్రేక్షకులకి అబ్బురపరిచే విన్యాసాలతో.. ఆశ్చర్యపోయే వింతలతో.. అత్యంత ఉత్సుకతతో.. ఊహించని ఉత్సాహంతో మనసారా ఆస్వాదించే చిత్రంగా సంజీవని నిలబడుతుందని మా నమ్మకం.. అనిఅన్నారు
లక్ష్మిపిక్చర్స్ అధినేత బాపిరాజు గారు మాట్లాడుతూ.. నేను చాలా చిత్రాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను. చాలా చిత్రాలకి ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ గా చేశాను.. చిత్రాన్ని నిర్మించాలంటే ఎంత కష్టమె.. విడుదల చేయ్యాలంటే ఎంత కష్టమె బాగా తెలిసిన వ్యక్తిని.. ఇలాంటి చిత్రాలు చెయ్యాలంటే ఎన్నో గట్స్ కావాలి.. నిర్మాత నివాస్ గారికి దన్యవాదాలు నాకు వరల్డ్ వైడ్ రైట్స్ ఇచ్చినందుకు.. అలాగే ఎన్నో ఇబ్బందు పడినా కూడా తన ప్రయాణం ఆపకుండా.. తన ప్రయాణికులతో అద్బుత ప్రయాణం కొనసాగించిన రవి గారికి మా ప్రత్యేఖ దన్యవాదాలు.. ఇక ఈ చిత్రం నేను చూశాను.. చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు.. చాలా అంటే చాలా బాగుంది.. అద్బుతమైన గ్రాఫిక్స్ తో అంతే ఎమెషన్ తో ఈ చిత్రం రేపు ఘన విజయం సాదించబోతుంది.. ముఖ్యంగా సెకండాఫ్ ఈ చిత్రం లో సన్నివేశాలు గూజ్ బంప్స్ రావటం ఖాయం.. తప్పకుండా జూన్ మెదటి వారంలో ఈ చిత్రం విడుదలవుతుంది. అని అన్నారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments