సెన్సేష‌న‌ల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తోన్నవిజ‌యేంద్ర ప్ర‌సాద్..

  • IndiaGlitz, [Saturday,June 23 2018]

అప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్ ర‌చ‌యిత‌గానే ఉన్న విజ‌యేంద్ర ప్ర‌సాద్ బాహుబ‌లి, బ‌జ‌రంగీ భాయ్‌జాన్ చిత్రాల‌తో స్టార్ రైటర్‌గా ప్యాన్ ఇండియాలో పేరు సంపాదించుకున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ సినిమాతో పాటు..ఓ ఆస‌క్తిక‌ర‌మైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నార‌ట‌. వివ‌రాల ప్ర‌కారం ఆర్‌.ఎస్‌.ఎస్‌కు సంబంధించిన స్క్రిప్ట్ అని టాక్‌.

ల‌హ‌రి మ్యూజిక్ సంస్థ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతుంది. అంతా సిద్ధ‌మైన త‌ర్వాత సినిమా సెట్స్‌కి వెళుతుంది. చిన్నప్ప‌డు ఆర్.ఎస్‌.ఎస్ స‌భ్యుడిగా ఉన్న విజ‌యేంద్ర ప్ర‌సాద్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. 1940 ఆర్‌.ఎస్‌.ఎస్ కార్య‌క్ర‌మాలతో ముద్ర వేసిన కిష‌న్ జీ వార‌ణాసి జీవితాన్ని ఈ సినిమాలో చూపించ‌బోతున్నారు.