RRR ఫైట్స్.. ఉత్కంఠ పెంచేసిన విజయేంద్ర ప్రసాద్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. విడుదల తేదీ విషయంలో అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక కొంత భాగం మాత్రమే షూటింగ్ మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తూ అంచనాలు పెంచేస్తున్నాయి. రాజమౌళి సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ ప్రత్యేకంగా ఉంటాయి. ప్రేక్షకులకు రోమాంచితం అయ్యేలా, సినిమాలో లీనమయ్యేలా రాజమౌళి యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో కేర్ తీసుకుంటారు.
ఇదీ చదవండి: వకీల్ సాబ్ : మతిపోగొడుతున్న నెల్లూరు కుర్రాళ్లు.. తమన్ ఫిదా
ఆర్ఆర్ఆర్ లో ఫైట్స్ సీన్స్ గురించి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. మనం యాక్షన్ సీన్స్ చూస్తున్నప్పుడు సహజంగానే కొట్టు, చంపు అని ఫీల్ అవుతాం. కేకలు పెట్టడం, విజిల్స్ వేయడం చేస్తాం. కానీ నేను తొలిసారి ఆర్ఆర్ఆర్ ఫైట్స్ చూసినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఆ సీన్స్ లో ఎమోషన్ అంత పెయిన్ ఫుల్ గా ఉంది. ఆడియన్స్ కూడా అలాగే ఫీల్ కాబోతున్నారు అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.
అలాగే ఎన్టీఆర్ గురించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ ని ఫస్ట్ టైం చూసినప్పుడే గొప్ప స్థాయికి చేరుతారని తెలుసు. తాను పని చేసిన చిత్రాలని పక్కన పెడితే.. అదుర్స్ చిత్రంలోని చారి పాత్ర తనకు ఎంతో ఇష్టం అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.
ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో..చరణ్ అల్లూరి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు పోరాట యోధులు స్నేహితులు ఐతే అనే కల్పన లోనుంచి ఈ కథ పుట్టింది. అలియా భట్, ఓలివియా మోరిస్ కథా నాయికలు. అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments