కార్తి కోసం రాజమౌళి తండ్రి
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి, బజరంగీ బాయ్‌జాన్ చిత్రాలకు కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ ఈ మధ్య కాలంలో తమిళంలో మెర్సల్(అదిరింది) హిందీలో మణికర్ణిక చిత్రాలకు కథ, కథనాన్ని అందించారు. ఇప్పుడు మళ్లీ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకు కథను అందించారు.
కాగా ఇప్పుడు ఓ తమిళ చిత్రానికి కథను అందిస్తున్నారు. ఈ చిత్రంలో కార్తి హీరోగా నటిస్తున్నారు. 'వేల్ వేల్ వెట్రివేల్' అనే టైటిల్‌తో తెరకెక్కనుందట. ఈ చిత్రానికి మహదేవ్ దర్శకత్వం వహించబోతున్నారు. ముందు ఈ చిత్రంలో లారెన్స్‌ను హీరోగా అనుకున్నప్పటికీ ఆయన స్థానంలో కార్తి వచ్చి చేరారట. వచ్చే ఏడాది నుండి చిత్రీకరణ ప్రారంభం అవుతుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments