మరో పాన్ ఇండియా కథలో విజయేంద్ర ప్రసాద్
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్, మణికర్ణిక వంటి భారీ పాన్ ఇండియా చిత్రాలకు కథలను అందించిన సీనియర్ స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తండ్రిగా ఈయన అందరికీ సుపరిచితులే. కేవలం రైటర్‌గానే కాకుండా దర్శకుడిగా కూడా ఈయన కొన్ని సినిమాలను తెరకెక్కించారు. ఆయన తర్వాత కూడా ఓ పాన్ ఇండియా కథను సిద్ధం చేస్తున్నారనే సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి.
వివరాల మేరకు చారిత్రాత్మకం, ఆధ్యాత్మికం అంశాలను మేళవించి విజయేంద్ర ప్రసాద్ ఓ పాన్ ఇండియా కథను సిద్ధం చేస్తున్నారట. ఇందులో రానా దగ్గుబాటి హీరోగా నటించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయట. సింగన్న అనే పేరుతో విజయేంద్ర ప్రసాద్ ఈ కథను సిద్ధం చేశారట. వెంకటేశ్వర స్వామివారి పరివారంలో ఓ యోధుడి కథని టాక్. వంట చెరుకుని సిద్ధం చేసే యువకుడి పాత్రలో రానా కనపడబోతున్నారట. పాన్ ఇండియా రేంజ్‌లో ఇమేజ్ ఉన్న రానా అయితే కథను న్యాయం జరుగుతుందని భావిస్తున్నారట. ఓ తమిళ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments