ప్రతి షోకి 100 టికెట్లు పంపండి.. థియేటర్ యాజమాన్యాలకు బెజవాడ మేయర్ లేఖ, వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. దీంతో డార్లింగ్ అభిమానులు గురువారం అర్థరాత్రి నుంచి థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అందరికంటే ముందే సినిమా చూసి స్నేహితులకు రివ్యూ చెప్పేయాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
అయితే సినిమా టికెట్ల కోసం ఏకంగా నగర మేయర్ రంగంలోకి దిగారు. ప్రతి షోకి తమకు 100 టికెట్లు పంపాలని కోరుతూ థియేటర్ యాజమాన్యాలకు లేఖలు రాశారు. ఇది ఎక్కడో విజయవాడలో జరిగింది. ‘‘విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సినిమా థియేటర్లలో ప్రతి నెలా కొత్త కొత్త చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలకు టికెట్లు సమకూర్చాలంటూ పార్టీ నేతలు, కార్పొరేటర్ల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. అందువల్ల కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు తప్పనిసరిగా ప్రతి షోకి 100 టికెట్లు కార్పోరేషన్‌కు కేటాయించండి. ఆ టికెట్లకు డబ్బు కూడా చెల్లిస్తామని విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి .. నగరంలోని సినిమా థియేటర్ల యాజమాన్యానికి లేఖ రాశారు. ఇప్పుడు ఈ లేఖ తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com