విజయవాడ అగ్ని ప్రమాద ఘటన దిగ్ర్భాంతికి గురి చేసింది: చిరంజీవి

విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఇలాంటి నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా పరిగణిస్తూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ ప్రభుత్వానికి ట్విట్టర్ వేదికగా సూచించారు.

‘‘విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల కుటుంబాలకు తీవ్ర సానుభూతి తెలియజేస్తూ, బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఇలాంటి నిర్లక్ష వైఖరిని తీవ్రంగా పరిగణిస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సినబాధ్యత ప్రభుత్వానిది’’ అని చిరంజీవి పేర్కొన్నారు. అయితే అంతకు ముందు చేపల వేపుడుకు సంబంధించిన పోస్టును పెడతానంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కాగా.. ‘విజయవాడ ట్రాజెడీ కలచివేసింది. కాబట్టి ఆ వీడియోను ఇవాళ పోస్ట్ చేయడం లేదు’ అని మరో ట్వీట్‌లో చిరు పేర్కొన్నారు.