Taj Mahal Tea:వాన పడితే సంగీతం .. ‘‘వాజ్ తాజ్’’ బిల్ బోర్డ్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు
Send us your feedback to audioarticles@vaarta.com
ఏ కంపెనీకైనా, ఉత్పత్తికైనా వినియోగదారులను ఆకర్షించడం అనేది కీలకం. ఇందుకోసం కొత్త కొత్త ‘పబ్లిసిటీ’ మార్గాలను అన్వేషిస్తాయి సంస్థలు. కరపత్రాలు, రేడియో, టీవీ, సినిమా థియేటర్లు, వాల్ పోస్టర్లు, వాల్ పోస్టర్లు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్, బ్రాండ్ ఎండార్స్మెంట్లు వచ్చాయి. ఇవన్నీ కూడా ఉత్పత్తులను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకే. కాగా.. విజయవాడ రైల్వేస్టేషన్ సమీపంలో బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీ బోర్డ్ ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది. స్థానికులకు , నిత్యం రైల్వేస్టేషన్‌కు వచ్చే వారికి అపూర్వమైన అనుభవాన్ని అందిస్తోంది. ఇప్పుడు దీనికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. అతిపెద్ద ‘‘ ఎన్విరాన్మెంటల్ ఇంటరాక్టివ్ బిల్బోర్డ్’’ గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా న్యాయనిర్ణేత స్వప్నిల్ దంగరికర్ తాజ్ మహల్ టీకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేషన్ అందించారు.
‘‘మేఘ్ సంతూర్’’ పేరుతో 2250 చదరపు అడుగుల బిల్‌బోర్డ్‌ను ఏర్పాటు చేశారు. 50 మంది నిపుణుల బృందంతో 6 నెలల పాటు శ్రమించి దీనిని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంతో దీనిని రూపొందించారు. వర్షం పడుతున్నప్పుడు ఈ భారీ హోర్డింగ్ వద్ద సంగీతం వినిపిస్తుంది. బోర్డు మీద అమర్చిన వాయిద్యాలు, వాన నీటి బిందువులతో నిండినప్పుడు, ప్రత్యేక అమరిక ద్వారా, 'మేఘ మల్హర్ రాగాన్ని' పలుకుతాయి. ఎనిమిది వారాలా పాటు దీనిని విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద వుంచనున్నట్లు హిందుస్థాన్ యూనిలీవర్ , బెవరేజెస్ అండ్ ఫుడ్స్ ప్రతినిధి శివకృష్ణమూర్తి చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments