విజయశాంతి రీ ఎంట్రీ...?

  • IndiaGlitz, [Saturday,January 07 2017]

లేడీ సూప‌ర్‌స్టార్ అంటూ ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాణించిన విజ‌య‌శాంతి త‌ర్వాత రాజ‌కీయాల్లో బిజీ అయ్యింది. త‌ర్వాత కొన్ని రోజులు సబ్ధుగా ఉండిపోయింది. ఇప్పుడు విజ‌య‌శాంతి రీ ఎంట్రీ కోసం రెడీ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబ‌ర్ 150లో విజ‌య‌శాంతి న‌టిస్తుంద‌ని వార్త‌లు కూడా వినిపించాయి. అయితే విజ‌య‌శాంతి రీ ఎంట్రీ మూవీ తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీల్లో రూపొంద‌నుంద‌ట‌. యుద్ధ నేప‌థ్యంలో సాగే ఈ సినిమా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కేలా ప్ర‌ణాళిక‌లు జ‌రుగుతున్నాయి. మ‌రి విజ‌య‌శాంతి రీ ఎంట్రీ మూవీ ఎలాంటి సెన్సేష‌న్స్‌కు దారి తీస్తుందో చూడాలి.