గౌతమీ ఆరోపణలు విచిత్రంగా అనిపిస్తున్నాయి - విజయశాంతి..!

  • IndiaGlitz, [Monday,December 19 2016]

లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా సినిమాల‌కు, రాజ‌కీయాలకు దూరంగా ఉన్నారు. అయితే...దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌తో విజ‌య‌శాంతికి మంచి అనుబంధం ఉంది. ఈ నేప‌ధ్యంలో ఇటీవ‌ల చెన్నై వెళ్లి అమ్మ స‌మాధిని ద‌ర్శించుకుని నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా విజ‌య‌శాంతి ఓ న్యూస్ ఛాన‌ల్ కి ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో అమ్మ మ‌ర‌ణం పై గౌత‌మీ చేస్తున్న ఆరోప‌ణ‌ల పై స్పందిస్తూ ....ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్లు ఎవ‌రు కూడా అమ్మ క‌ష్టంలో ఉన్న‌ప్పుడు రాలేదు.
వాస్త‌వాలు మాకు తెలుసు క‌దా..! సి.ఎం అయినప్పుడు ఆమె బాగున్న‌ప్పుడు వెళ్ల‌డం వేరే విష‌యం. క‌ష్టంలో ఉన్న‌ప్పుడు నిలిచిన‌వాళ్లే నిజ‌మైన ఆప్తులు అంటాం. నాకు తెలిసి వీళ్లు ఎవ‌రూ ఆమె కోసం రాలేదు . జైలుకి వెళ్లిన‌ప్పుడు... బాధ‌లో ఉన్న‌ప్పుడు రాలేదు. కొత్త‌గా మాట్లాడుతుంటే విచిత్రంగా అనిపిస్తుంది. అయినా... ఒక హాస్ప‌ట‌ల్ లో కెమెరాలు ఉంటాయి. ఆధారాలు కావాలంటే తీసుకోవ‌చ్చు. ఏమీ తెలుసుకోకుండా మిస్ట‌రీ జ‌రిగింద‌నో.. కుట్ర జ‌రిగిందనో ఒక‌రి మీద బుర‌ద చ‌ల్ల‌డం క‌రెక్ట్ కాదు అంటూ గౌత‌మీ ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు విజ‌య‌శాంతి..!

More News

ఆదా శ‌ర్మ అమ్మ‌ను చూస్తే షాక్ అవుతారు..!

హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక ఆదాశ‌ర్మ‌. ఆత‌ర్వాత స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్, క్ష‌ణం త‌దిత‌ర చిత్రాల్లో న‌టించారు.

డిసెంబర్ 26న తిరుపతిలో గ్రాండ్ లెవల్లో 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఆడియో విడుదల

కలియుగ దైవం శ్రీ తిరుమల వేంకటేశ్వరుడి పాదాల చెంతనున్న తిరుపతిలో నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో ఆవిష్కరణ కానుంది.

ట్విట్టర్ లో రాజశేఖర్ ఎంట్రీ..కెసిఆర్ నిర్ణయానికి మద్దతు..!

యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చారు.ఫస్ట్ ట్వీట్ అంటూ తెలంగాణ రాష్ట్ర సి.ఎం కెసిఆర్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ ట్వీట్ చేసారు.

అప్పుడు త్రిష..ఇప్పుడు కాజోల్....మధ్యలో ధనుష్

ధనుష్ హీరోగా రూపొంది ఘన విజయం సాధించిన వేల ఇల్లాద పట్టదారి సినిమాను తెలుగులో రఘవరన్ బి.టెక్ పేరుతో విడుదల చేస్తే తెలుగులో కూడా రఘవరన్ బి.టెక్ పెద్ద హిట్ అయ్యింది.

అంచనాలను పెంచేస్తున్న శతమానంభవతి పాటలు..!

ఉత్తమాభిరుచి గల నిర్మాత దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్నమరో కుటుంబ కథా చిత్రం శతమానంభవతి.