చిరు సలహా: రంగమ్మత్తకు షాకిచ్చిన రాములమ్మ!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇదేంటి.. అసలు ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా నటించిన యాంకర్ అనసూయకు.. లేడీ అమితాబ్ విజయశాంతి అలియాస్ రాములమ్మ షాకివ్వడమా..? అసలు వీరిద్దరికీ పోలికేంటి..? వీరిద్దరికీ ఎలాంటి సంబంధాల్లేవ్ కదా..? ఇక షాకివ్వడానికేముంది అనే అనుమానం వస్తోంది కదూ.. ఎస్.. మీరు వింటున్నది నిజమే. అసలు ఆ షాక్ ఏంటి..? రాములమ్మ ఏ రూపంలో షాకిచ్చింది..? అనే విషయాలు www.indiaglitz.com అందిస్తున్న ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
సీన్ ఇక్కడ మారింది..!
ఒకట్రెండు కాదు ఏకంగా 13 ఏళ్లకుపైగా సినిమాలకు దూరమై రాజకీయాలకు రాణించాలని భావించిన రాములమ్మ పరిస్థితి.. ‘అనుకొన్నదొక్కటి.. అయినది ఒక్కటి’ అన్న చందంగా మారడంతో సూపర్‌స్టార్ మహేశ్ బాబు-అనిల్ రావిపూడి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’తో రీ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. కీలక పాత్రతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా ఎల్లుండి అనగా జనవరి-11న థియేటర్లలోకి వచ్చేస్తోంది. కాగా ఈ సినిమా తర్వాత రాములమ్మ పరిస్థితేంటి..? ఏ సినిమాలో నటిస్తుంది..? సినిమా షూటింగ్ అయిపోగానే వార్తలు వచ్చాయ్. అయితే మెగాస్టార్ చిరు సినిమాలో నటించే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. ఒకప్పటి సూపర్ హిట్ జంట.. మళ్లీ ఒకే సినిమాలో కనిపిస్తారని వార్తలు గుప్పుమన్నాయ్. అయితే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను బట్టి చూస్తే ఇది అక్షరాలా నిజమయ్యే అవకాశాలు వందశాతం ఉన్నాయని చెప్పుకోవచ్చు.
చిరు సలహాతో షాక్!
సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ.. మెగాస్టార్ చిరంజీవితో సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్‌లో రంగమ్మత్త.. యాంకర్ అనసూయను తీసుకున్నారట. ఈ పాత్రే సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందట. అయితే ఇటీవల జరిగిన ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరు-విజయశాంతి మధ్య ఆసక్తికర సంభాషణ జరగడం.. పాత్ర ఇస్తే చేస్తావా అని చిరు అడగటం.. ఎస్ అని రాములమ్మ చెప్పడంతో అనసూయ పాత్ర ఆమెకే ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట. చిరు సలహాతో కొరటాల.. అనసూయను పక్కనెట్టేశారని ఆ చాన్స్ రాములమ్మకు ఇచ్చేశారట. అంటే చిరు సలహాతో రంగమ్మత్తకు రాములమ్మ రూపంలో షాక్ తగిలిందన్న మాట.
అయితే ఈ వ్యవహారంపై అటు చిత్రబృందం కానీ.. ఇటు విజయశాంతి కానీ క్లారిటీ ఇవ్వలేదు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఎవరో ఒకరు సోషల్ మీడియా లేదా మీడియా వేదికగానే వెల్లడించాల్సిందే. అయితే.. ఒక వేళ ఇదే నిజమైతే మాత్రం మెగా ఫ్యాన్స్‌కు మళ్లీ పాతరోజులు గుర్తుకు రావడం ఖాయమే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments