'మా' బరిలో ఊహించని వ్యక్తి.. విజయశాంతి సపోర్ట్!
Send us your feedback to audioarticles@vaarta.com
త్వరలో జరగబోయే మా అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ లో రోజుకొక పరిణామం చోటు చేసుకుంటోంది. ఈసారి అధ్యక్షా పదవి కోసం పోటీ చేస్తున్నవారంతా ఎవరూ ఊహించని వారే. తన విలక్షణ నటనతో ఇండియా మొత్తం క్రేజ్ తెచ్చుకున్న నటుడు ప్రకాష్ రాజ్. దేశవ్యాప్తంగా బడా పొలిటీషియన్స్ పై విమర్శలు గుప్పించే ప్రకాష్ రాజ్ 'మా' అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తారని ఎవరైనా ఊహించారా!
మోహన్ బాబు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు తన సినిమాలతో ప్రేక్షకులని అలరించేందుకు ప్రయత్నిస్తున్నాడు. కుర్రవాడైన విష్ణు ఇలా మా అధ్యక్ష బరిలో నిలుస్తాడనేది ఊహించని పరిణామం. వీరిద్దరికి పోటీగా జీవిత, హేమ కూడా అధ్యక్ష బరిలో నిలిచారు.
సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీవీఎల్ నరసింహా రావు ఆదివారం ఆసక్తికర ప్రకటన చేశారు. తాను కూడా మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ వాదంతో తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. తన ప్యానల్ పేరుని 'తెలంగాణ వాదం' అని ప్రకటించారు. ఈ సందర్భంగా సీవీఎల్ ఏపీ, తెలంగాణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ఆర్టిస్టుల సమస్యలే తన అజెండా అని ప్రకటించారు. ఏపీలో కూడా చిన్న, మధ్యతరగతి ఆర్టిస్టులకు అన్యాయం జరుగుతోంది అని అన్నారు. ఇతర భాషల నటుల గురించి పదేళ్ల క్రితమే కొన్ని నిబంధనలు పెట్టాం. ఇప్పుడు వాటిని తుంగలోకి తొక్కి తెలుగు ఆర్టిస్టులకు అన్యాయం చేస్తున్నారు.
రెండు తెలుగురాష్ట్రాల్లో ప్రత్యేకంగా సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖలు ఏర్పడ్డాయి. కాబట్టి మా అసోసియేషన్ ని కూడా ఏపీ, తెలంగాణగా విభజించాలి అని నరసింహారావు డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా లేడి సూపర్ స్టార్ విజయశాంతి.. సీవీఎల్ నరసింహారావుకు మద్దతు తెలిపారు. 'మా' ఎన్నికల పై సీవీయల్ నరసింహా రావు అవేదన న్యాయమైనది, ధర్మమైంది. నేను మా సభ్యురాలినీ కాకపోయినా ఒక కళాకారిణి గా స్పందిస్తున్నా...చిన్న కళాకారుల సంక్షేమం దృష్టా సీవీయల్ అభిప్రాయాలను సంపూర్ణంగా సమర్థిస్తున్నా అని విజయశాంతి ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout