Vijayashanthi:బీజేపీలో కేసీఆర్ నాటిన మొక్క ఉంది.. విజయశాంతి సంచలన ఆరోపణలు
Send us your feedback to audioarticles@vaarta.com
కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని బీజేపీ చెబితే ఆ పార్టీలోకి వెళ్లానని.. కానీ ఏళ్లు గడచినా ఆ మేరకు చర్యలు తీసుకోలేదన్నారు. కేసీఆర్ అవినీతిపై ప్రధాని మోదీ దగ్గర ఆధారాలు ఉండి కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని.. తెరపై విమర్శలు.. తెర వెనుక ఒప్పందాలు చేసుకున్నాయంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.
అలాగే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పార్టీ అధ్యక్షుడి మార్పు సరికాదని సూచించానని.. కానీ అధిష్టానం వినలేదన్నారు. అందుకు కారణం ‘బీజేపీలో కేసీఆర్ నాటిన ఓ మొక్క’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మొక్క మాటలు నమ్మిన కమలం పెద్దలు బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారని తెలిపారు. ఇలాంటి కారణాలతోనే బీజేపీకి రాజీనామా చేశానని రాములమ్మ వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ బలపడిందిని.. కేసీఆర్‌ను గద్దె దింపే సత్తా సాధించిందన్నారు. అందుకే తిరిగి సొంత గూటికి చేరానని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందని.. వెంటనే కేసీఆర్ అవినీతిని కక్కించటం ఖాయం అని ఆమె ధీమా వ్యక్తంచేశారు.
కాగా కాంగ్రెస్ పార్టీలో అలా చేరారో లేదో విజయశాంతికి కీలక పదవి అప్పగించిన సంగతి తెలిసిందే. పార్టీ ప్రచార, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌గా ఆమెను అధిష్టానం నియమించింది. కన్వీనర్లుగా సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లు రవి, కోదండరెడ్డి, నరేందర్‌రెడ్డి, యరపతి అనిల్, రాములు నాయక్, పిట్ల నాగేశ్వరరావు, ఒబేదుల్లా కొత్వాల్, రమేష్, పారిజాతరెడ్డి, సిద్దేశ్వర్, రామ్మూర్తి నాయక్, అలీ బిన్ ఇబ్రహీం, దీపక్ జాన్‌లకు చోటు కల్పించింది. కొత్త, పాత నేతల కలయికగా ఈ కమిటీలను నియమించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments