రాజకీయాలకే తొలి ప్రాధాన్యత : విజయశాంతి
- IndiaGlitz, [Wednesday,October 30 2019]
''రాజకీయాలనేవి పూర్తి అంకిత భావంతో చేయాలి. కాబట్టి ప్రస్తుతం నా ప్రాధాన్యత ముందు రాజకీయాలకే'' అని అంటున్నారు లేడీ అమితాబ్ విజయశాంతి. ఈమె భారతి అనే కీలకపాత్రలో నటించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతికి విడుదల కాబోతున్నఈ సినిమాలో విజయశాంతి ప్రొఫెసర్ పాత్రలో కనపడుతున్నారు. దీపావళి సందర్భంగా విజయశాంతి లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
చాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమాల్లో నటిస్తున్న విజయశాంతి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ''సినిమా అంటే ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం.. అయితే రాజకీయాలంటే జనాల కోసం పనిచేయడం. అనిల్ రావిపూడి కథ చెప్పగానే రెండు గంటలు పాటు కడుపుబ్బా నవ్వాను. మరోసారి నా పాత్ర గురించి చెప్పమని తెలుసుకున్నాను. ఇన్నేళ్ల తర్వాత వంద శాతం నా రీ ఎంట్రీకి భారతి పాత్ర సరిపోయే పాత్ర. ఈ సినిమాలో లుక్ కోసం చాలా కష్టపడ్డాను. డైట్‌ను పాటిస్తూనే రోజుకు రెండు గంటలు జిమ్‌లో కష్టపడ్డాను. అందువల్ల 10 కిలోల బరువు తగ్గాను'' అన్నారు.
సూపర్‌స్టార్ మహేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది. అనిల్ సుంకర, దిల్‌రాజు, మహేశ్ నిర్మాతలు.