‘సరిలేరు..’లో తన పాత్రేంటో చెప్పేసిన రాములమ్మ!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. సినిమా రిలీజ్‌కు రోజులు దగ్గరపడుతుండటంతో షూటింగ్ స్పీడ్‌ను పెంచింది చిత్రబృందం. కాగా ఈ సినిమాతో లేడీ అమితాబ్ విజయశాంతి అలియాస్ రాములక్క రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈమెకు సంబంధించిన లుక్, సాంగ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరోవైపు చిత్రబృందం ప్రమోషన్‌లో బిజిబిజీగా ఉంది. తాజాగా.. విజయశాంతి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకోవడంతో.. సినిమా ఎలా ఉండబోతోందో చెప్పేసింది.
‘సరిలేరు.. సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఈ సినిమా చూశాను.. చాలా బాగా వచ్చింది. ఈ చిత్రంలో నాది ‘డిగ్నిఫైడ్ క్యారెక్టర్’. ఒక అందమైన సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి చేశారు. అనీల్‌కు మంచి భవిష్యత్ ఉంది. 1988లో వచ్చిన కొడుకుదిద్దిన కాపురంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మహేశ్ బాబు నటించాడు.. నాడు ఎంతో క్యూట్‌గా ఉన్న మహేశ్‌ను నేను కొట్టాల్సి వచ్చింది. నాకు మనసు రాలేదు కానీ.. ఈ సీన్ కోసం ఎన్నో టేక్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ చిన్న పిల్లోడే ఇవాళ సూపర్ స్టార్.. మళ్లీ ఆ బిడ్దతో కలిసి నటిస్తాను అని నేనెప్పుడూ అనుకోలేదు’ అని రాములక్క చెప్పుకొచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com