Vijayashanthi:బీజేపీకి విజయశాంతి రాజీనామా.. కాంగ్రెస్ పార్టీలోకి రాములమ్మ..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీకి భారీ షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పగా.. తాజాగా మరో సీనియర్ నాయకురాలు విజయశాంతి పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషణ్ రెడ్డికి పంపించారు. శుక్రవారం తెలంగాణ పర్యటనకు రానున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో రాములమ్మ హస్తం కండువా కప్పుకోనున్నారు.
తనకు పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదనే అభిప్రాయంలో ఉన్న విజయశాంతి గత కొంతకాలంగా బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. బండి సంజయ్‌ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత ఆమె అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ వీడతారని ప్రచారం జరిగినప్పటికీ ఆమె స్పందించలేదు. కానీ ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా ఆమె బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి లాంటి నేతలు బీజేపీని వీడారు. వివేక్, రాజగోపాల్ రెడ్డిలు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. 1998లో రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి తొలుత బీజేపీలో చేశారు. అనంతరం 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. 2009లో కేసీఆర్ విజ్ఞప్తి మేరకు టీఆర్ఎస్‌లో ఆ పార్టీని విలీనం చేశారు. అనంతరం 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం బీజేపీలో చేరారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com