Vijayashanthi:బీజేపీకి విజయశాంతి రాజీనామా.. కాంగ్రెస్ పార్టీలోకి రాములమ్మ..?

  • IndiaGlitz, [Thursday,November 16 2023]

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీకి భారీ షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పగా.. తాజాగా మరో సీనియర్ నాయకురాలు విజయశాంతి పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషణ్ రెడ్డికి పంపించారు. శుక్రవారం తెలంగాణ పర్యటనకు రానున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో రాములమ్మ హస్తం కండువా కప్పుకోనున్నారు.

తనకు పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదనే అభిప్రాయంలో ఉన్న విజయశాంతి గత కొంతకాలంగా బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. బండి సంజయ్‌ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత ఆమె అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ వీడతారని ప్రచారం జరిగినప్పటికీ ఆమె స్పందించలేదు. కానీ ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా ఆమె బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి లాంటి నేతలు బీజేపీని వీడారు. వివేక్, రాజగోపాల్ రెడ్డిలు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. 1998లో రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి తొలుత బీజేపీలో చేశారు. అనంతరం 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. 2009లో కేసీఆర్ విజ్ఞప్తి మేరకు టీఆర్ఎస్‌లో ఆ పార్టీని విలీనం చేశారు. అనంతరం 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం బీజేపీలో చేరారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

More News

Bigg Boss Telugu 7 : ప్రశాంత్‌కు రతిక మరో వెన్నుపోటు .. అర్జున్ మాటలకు శోభ కంటతడి, ‘‘ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ’’లో ట్విస్టులు

బిగ్‌బాస్ 7 తెలుగులో ప్రస్తుతం 10 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. సోమ, మంగళవారాల్లో నామినేషన్స్ రచ్చ నడవగా..

Chandrababu: చంద్రబాబుకు గుండె సమస్య.. ఏపీ హైకోర్టుకు వైద్యుల నివేదిక..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఏపీ హైకోర్టుకు ఆయన తరపు న్యాయవాదులు నివేదిక సమర్పించారు. అయితే ఈ నివేదికలో కీలక విషయాలు వెల్లడించారు.

Telangana Congress: రెబల్స్ విషయంలో ఫలించిన కాంగ్రెస్ వ్యూహం

తెలంగాణ ఎన్నికల్లో నేటితో నామినేషన్ల ఉపంసహరణ ప్రక్రియ ముగిసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 2898 నామినేషన్లను అధికారులు ఆమోదించారు. అత్యధికంగా గజ్వేల్‌ బరిలో 86 మంది అభ్యర్థులు నిలవగా..

Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ తొలి వర్థంతి సందర్భంగా ప్రముఖుల నివాళి

సూపర్ స్టార్ కృష్ణ మరణించి నేటితో ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా అభిమానులు, కుటుంబసభ్యులు, ప్రముఖులు ఆయనను స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు.

జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. 36 మంది మృతి

జమ్మూ కశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కిష్త్వాఢ్‌ నుంచి ప్రయాణికులతో కలిసి జమ్మూ వెళ్తున్న ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 36మంది