‘సరిలేరు’లో రాములమ్మ రెమ్యునరేషన్ ఎంతంటే..!
Send us your feedback to audioarticles@vaarta.com
‘నేటి భారతం’, ‘ప్రతిఘటన’, ‘కర్తవ్యం’, ‘ఒసేయ్ రాములమ్మ’ వంటి చిత్రాలతో జాతీయ ఉత్తమ నటి, లేడీ అమితాబ్ విజయశాంతి సంచలనం సృష్టించింది. సూపర్‌స్టార్ మహేశ్, రష్మిక మందన్నా నటీనటులుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో భారతి పాత్రతో అద్భుతమైన రీఎంట్రీ ఇస్తోంది. అంటే సుమారు 13 ఏళ్ల తర్వాత రాములమ్మ రీ ఎంట్రీ ఇస్తోంది. అయితే ఆమె పాత్ర ఎలా ఉంటుంది..? పాత్రకు న్యాయం చేశారా..? అనే విషయాలపై మొన్నటి వరకూ పెద్ద చర్చే జరిగింది. అయితే ట్రైలర్‌ను బట్టి చూస్తే కాస్త క్లారిటీ వచ్చింది. తాజాగా.. ఆమె ఈసినిమాలో నటించడానికి పారితోషికం ఎంత పుచ్చుకున్నారు..? అడిగినంతే దర్శకనిర్మాతలు ఇచ్చారా..? లేదా..? అనే విషయాలు టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యాయి.
అయితే.. విజయశాంతికి అత్యంత సన్నిహితులను రెమ్యునరేషన్ విషయమై అడిగి తెలుసుకోగా.. ఆయన చెప్పిన మాటలకు జనాలు షాకయ్యారట. మొదట ఆమె హీరోయిన్ రేంజ్లో ఏకంగా రూ. 2 కోట్లు అడగ్గా.. వామ్మో.. ఇంతనా అని అవాక్కయిన దర్శకనిర్మాతలు చర్చించి.. చర్చించి చివరకు రూ. 1.5 కోట్లుకు ఫిక్స్ చేశారట. అంటే ఇంచుమించు ఫైనల్ చేసిన పారితోషికం.. హీరోయిన్ రేంజ్‌లోనే ఉంది. అంటే రెమ్యునరేషన్ విషయంలో రాములమ్మకు ‘సరిలేరు నీకెవ్వరు’ అనక తప్పదేమో.!
నాటికీ.. నేటికి రాములమ్మ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఈ రెమ్యునరేషన్ విషయంలోనే తేలిపోయిందన్న మాట. వాస్తవానికి ఈ పాత్రలో రాములమ్మ తప్ప మరెవ్వరూ నటించినా సెట్ అవ్వరని.. ఒకవేళ వేరేవార్ని తీసుకున్నా న్యాయం చేయలేరని భావించిన దర్శకనిర్మాతలు చేసేదేమీ లేక విజయశాంతినే ఫైనల్ చేయడం.. ఆమె అడిగినంతే కాస్త అటు ఇటూ ఇవ్వాల్సి వచ్చిందట. మరి ఇందులో నిజమెంత ఉందో.. అంత రెమ్యునరేషన్‌కు రాములమ్మ న్యాయం చేసిందో లేదో తెలియాలంటే సంక్రాంతికి సినిమా రిలీజ్ అయ్యే వరకూ వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com